నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’ మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఈ సినిమాలోని మొదటి పాట సమయమా విడుదల చేసే తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. సమయమా పాట సెప్టెంబర్ 16న విడుదల కానుంది. పోస్టర్ లో నాని చిరునవ్వుతో తన చేతులను విప్పి అనందంగా కనిపిస్తున్నారు. పోస్టర్ సూచించినట్లుగా, సమయమా పాట అందమైన, మ్యాజికల్ మెలోడీ. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానిన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనుంది.
గ్లింప్స్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇటీవలి నాని సినిమాల మాదిరిగానే ‘హాయ్ నాన్న’ చార్ట్‌బస్టర్ ఆల్బమ్ గా వుంటుంది.
ఈ చిత్రానికి సాను జాన్ వరుగీస్ ISC సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు.
‘హాయ్ నాన్న’ ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా