ttdp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

టీటీడీపీకి దారేది…

ఉమ్మడి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగి, పాతికేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి ఉమ్మడి నల్లగొండ జిల్లా వెన్నుదన్నుగా నిలబడింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించింది. తెలంగాణ టీడీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో రెండు కళ్ల సిద్దాంతంతో బొక్కాబోర్లా పడింది. ఇపుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ పార్టీ ఉనికి కూడా లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగి, పాతికేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి ఉమ్మడి నల్లగొండ జిల్లా వెన్నుదన్నుగా నిలబడింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించింది.ఈ ఏడాది చివరలో జరగనున్న తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానం నుంచైనా పోటీ చేయడం అనుమానంగానే ఉంది. జిల్లా నుంచి టీడీపీ పక్షాన వివిధ పదవులు అనుభవించిన నాయకులంతా ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కు లేకుండా పోయింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలో.. నాగార్జున సాగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, నల్లగొండ అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ నేతలు సుదీర్ఘ కాలమే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశారు. భువనగిరి నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి, ఆయన మరణానంతరం ఆయన భార్య ఉమా మాధవరెడ్డి, ఆలేరు నుంచి మోత్కుపల్లి నర్సింహులు ఎన్.టి.రామారావు, చంద్రబాబు నాయుడు కేబినెట్లలో మంత్రులుగా వ్యవహరించారు.నాగార్జున సాగర్ కుందూరు జానారెడ్డి రామారావు మంత్రివర్గంలో సభ్యుడు. తుంగతుర్తిలో సంకినేని వెంకటేశ్వరరావు, ఎస్సీ రిజర్వుడుగా మారిన తర్వాత మోత్కుపల్లి నర్సింహులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. నల్లగొండ నుంచి రఘుమారెడ్డి, గడ్డం రద్రమ దేవి ఎమ్మెల్యేలుగా కాగా, అప్పటి సీఎం ఎన్.టి.రామారావు సైతం నల్లగొండ నుంచి విజయం సాధించారు. సూర్యాపేట నుంచి ఆకారపు సుదర్శన్, కోదాడ నుంచి అయిదు పర్యాయాలు వేనేపల్లి చందర్ రావు, నాగార్జున సాగర్ లోజానారెడ్డి తర్వాత రామ్మూర్తి యాదవ్ లు టీడీపీ ఎమ్మెల్యేలుగా వెలిగారు. ప్రస్తుత తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి 1999 లో టీడీపీ నుంచి ఎంపీగా కూడా గెలిచారు.

ఇపుడు బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న బడుగుల లింగయ్య యాదవ్ జిల్లా టీడీపీ అధ్యక్షునిగా అత్యధిక కాలం పనిచేశారు. టీడీపీతో పొత్తుతో సీపీఎం తుంగతుర్తి, నకిరేకల్, మిర్యాలగూడెం లో, సీపీఐ మునుగోడు, దేవరకొండ స్థానాల్లో ప్రాతినిధ్యం వహించింది. ఇపుడు ఇదంతా గత చరిత్ర.తెలంగాణ ఆవిర్భావం తర్వాత తుంగతుర్తి, నకిరేకల్, నాగార్జున సాగర్ వంటి స్థానాల్లో పోటీ చేసినా.. ఆ తర్వాత జిల్లాలో టీడీపీ ఉనికి కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఆ పార్టీ యంత్రాంగమంతా ప్రస్తుతం వివిధ పార్టీల్లో సర్దుకుంది. ఉన్న నాయకులే టీడీపీని వీడి వెళ్లిపోయిన కారణంగా కొత్తగా వచ్చి పార్టీలో చేరే వారు లేకుండా పోయారు.రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని బాధ్యతలు చేపట్టాక కూడా నల్లగొండ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. దీంతో ఉన్న కొద్దిపాటి కేడర్ లో కూడా ఉత్సాహం లేకుండా పోయింది. భారీ పెట్టుబడులతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సాహసించే నాయకుడు లేకుండా పోయారు. చివరకు జిల్లా కేంద్రలోని టీడీపీ కార్యాలయాన్ని రోజూ తెరిచే నాథుడే లేకుండా పోయాడు