sec-bad
తెలంగాణ

మూలధన వ్యయంలో నూతన గరిష్ఠ రికార్డు నెలకొల్పిన దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్

దక్షిణ మధ్య రైల్వే విభాగం మూల ధన వ్యయంలో నూతన రికార్డు నెలకొల్పింది. ప్రస్తుత ఆర్థిక సం. మొదటి 5 నెలల్లో వివిధ అభివృద్ధి పనులకు వెచ్చించిన మూలధన వ్యయం రూ. 8,286 కోట్లు. దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో మొదటి ఐదు నెలల్లో అనగా ఆగస్టు 2023 వరకు వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల అమలులో 54% కంటే ఎక్కువ మూలధన నిధుల వ్యయం (కాపెక్స్) తో గణనీయమైన పురోగతిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో అనగా, 2022-23లో ఆగస్టు వరకు మూలధనం కింద నిధుల ఖర్చు 34% మాత్రమే .
దక్షిణ మధ్య రైల్వేకు 2023-24 సంవత్సరానికి సవరించిన బడ్జెట్లో రూ. 15,258 కోట్లు అత్యధిక నిధులు మంజూరు అయ్యాయి.
దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో 54% కంటే ఎక్కువ మూలధన వ్యయంలో రికార్డు సాధించగలిగింది, తద్వారా అనేక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను వేగంగా అమలు చేయడానికి ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. కొత్త మౌలిక సదుపాయాల కల్పన మరియు వివిధ కొత్త లైన్లకు చివరి మైలు వరకు అనుసంధాన్నిఅందించడం అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ముఖ్యమైన రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి మరియు సరుకు రవాణా టెర్మినల్స్ మార్పు మొదలైన వాటికి తగిన ప్రాముఖ్యత ఇచ్చారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, ప్రాజెక్టుల వేగవంతమైన అమలును నిర్ధారించడానికి అన్ని అభివృద్ధి పనుల పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టుల అమలులో కనీస జాప్యం జరగకుండా సరైన ప్రణాళికపై ఆయన దృష్టి సారించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో మూలధన నిధుల వ్యయం వినియోగంలో సాధించిన పురోగతికి బృందాన్ని ప్రశంసించారు మరియు ప్రతి దశలో ప్రాజెక్ట్ అమలు వేగంగా జరిగేలా ఖచ్చితమైన ప్రణాళికను కొనసాగించాలని సూచించారు.