తెలంగాణ రాజకీయం

పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఖాళీలను డిప్యూటేషన్‌ విధానంలో భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ విద్యార్హతతోపాటు సంబంధిత విభాగాల్లో కనీసం ఏడాది నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలు, అనుభవవం ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానంలో జూన్ 20లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు నింపి, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో సమర్పించాలి. అర్హతలు, అనుభవం ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు..
* టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగాలు (డిప్యూటేషన్)
ఖాళీల సంఖ్య: 06.
➥ చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 01.
అర్హత: ఎంటెక్ (సీఎస్‌ఈ/ఐటీ) లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్).
అనుభవం: ఐటీ విభాగంలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
జీతం: రూ.1,06,990 – రూ.1,58,380.
➥ చీఫ్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 01.
అర్హత: ఎంటెక్ (సీఎస్‌ఈ/ఐటీ) లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్).
అనుభవం: నెట్‌వర్క్ సెక్యూరిటీ/సైబర్ సెక్యూరిటీ విభాగంలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
జీతం: రూ.1,06,990 – రూ.1,58,380.
➥  సీనియర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్
పోస్టుల సంఖ్య: 01.
అర్హత: బీటెక్ (సీఎస్‌ఈ/ఐటీ) లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్).
అనుభవం: నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కనీసం 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
జీతం: రూ.45,960 – రూ.1,24,150.
➥ జూనియర్‌ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్
పోస్టుల సంఖ్య: 01.
అర్హత: బీటెక్ (సీఎస్‌ఈ/ఐటీ) లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్).
అనుభవం: నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కనీసం ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.
జీతం: రూ.43,490 – రూ.1,18,730.
➥ సీనియర్‌ ప్రోగ్రామర్‌
పోస్టుల సంఖ్య: 01.
అర్హత: బీటెక్ (సీఎస్‌ఈ/ఐటీ) లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్).
అనుభవం: ప్రోగ్రామింగ్‌లో కనీసం 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
జీతం: రూ.54,220 – రూ.1,33,630.
➥ జూనియర్‌ అడ్మినిస్ట్రేటర్
పోస్టుల సంఖ్య: 01.
అర్హత: బీటెక్ (సీఎస్‌ఈ/ఐటీ) లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్).
అనుభవం: ప్రోగ్రామింగ్‌లో కనీసం 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
జీతం: రూ.42,300 – రూ.1,15,270.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు నింపి, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను జతచేసి హైదరాబాద్, ప్రతిభా భవన్‌లోని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయంలో సమర్పించాలి.
ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.