govt school
తెలంగాణ రాజకీయం

అక్టోబరు 24 నుంచి స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సంక్షేమం కోసం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టనుంది. అక్టోబర్ 24 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్ (అల్పాహారం) కూడా అందించనున్నారు.ప్రభుత్వ పాథమిక పాఠశాలలో చదువుకునే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ప్రతీ రోజు బ్రేక్‌ పాస్ట్‌ను అందించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు సైతం జారీ చేసింది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం ఇంట్లో అల్పహారం పొందే అవకాశం లేని విద్యార్థుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.ఇదిలా ఉంటే విద్యార్థులకు అల్పాహారం పేరుతో ఇప్పటికే తమిళనాడులో ఓ పథకం అమల్లో ఉంది.

ఈ పథకం అమలు తీరును తెలుసుకోవాలని గత కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి కొందరు ఐఏఎస్‌ల బృందాన్ని తమిళనాడుకు పంపించారు. అయితే తమిళనాడు వెళ్లిన ఐఏఎస్‌ల బృందం పథకం అమలవుతున్న తీరుపై పూర్తి స్థాయిలో అధ్యయనం నిర్వహించి, నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.అయితే తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే బ్రేక్‌ఫాస్ట్‌ను అందిస్తుండగా తెలంగాణలో మాత్రం ప్రాథమిక పాఠశాలలతో పాటు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైతం టిఫిన్‌ను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 400 కోట్లు ఖర్చు చేయనుంది. దసరా కానుకగా అక్టోబర్‌ 24 నుంచి ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లభించడంతో వారు ఆకలి బాధ, సమస్యలు లేకుండా చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది సర్కార్. ఉదయాన్నే వ్యవసాయం పనులు, కూలీపనులు చేసుకోవడానికి వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి ఈ అల్పాహార పథకాన్ని ప్రకటించారు.

విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనుందితమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకాన్ని (విద్యార్థులకు అల్పాహార పథకం) పరిశీలించి రావాలని సీఎం కేసీఆర్ ఐఎఎస్ అధికారుల బృందాన్ని ఇటీవల అక్కడికి పంపించారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న “విద్యార్థులకు అల్పాహారం” పథకాన్ని అధ్యయనం చేసిన ఐఏఎస్ అధికారుల బృందం తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించింది. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించిన సీఎం కేసీఆర్,  ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు (6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు) కూడా బ్రేక్ ఫాస్టును అందచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.