ఎడ్యుకేషన్ హబ్ గా మహబూబాబాద్ జిల్లాను చేయడం గర్వంగా ఉందని, కేసీఆర్, కేటీఆర్ ల మేలును ఎన్నటికీ మరువలేవమని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు, ఇంజనీరింగ్, హార్టికల్చర్ కాలేజీలు మంజూరు కావడంతో బీ ఆర్ ఎస్ కార్యకర్తలతో నాలుగు వేల మంది విద్యార్థులు, యువతతో కలిసి ద్విచక్ర వాహనం పై భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని NTR స్టేడియం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో నెహ్రూ సెంటర్ వరకు కొనసాగింది. మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ ఛైర్మెన్, మున్సిపల్ ఛైర్మెన్ లు బైక్ పై ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. నెహ్రూ సెంటర్లో 25 పీట్ల తో ఏర్పాటు చేసిన KCR చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూల మాల వేశారు.
ఈ సందర్భంగా మంత్రీ మాట్లాడుతూ… మానుకోట జిల్లాను విద్యా కేంద్రంగా, ఎడ్యుకేషన్ హబ్ గా విరాజిల్లుతుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకులాలు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మేట్రిక్ విద్యాలయలతో పాటు, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, జేఎన్టీయూ అనుబంధంగా ఇంజనీరింగ్ కాలేజ్, ఎంబీఏ కాలేజీ ఇలా అనేక కాలేజీలు జిల్లాకు రావడం సంతోషంగా ఉందని, వెనుకబడిన మహబూబాబాద్ జిల్లా ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఎడ్యుకేషన్ హబ్ గా పేరుగాంచడం సంతోషకరం అన్నారు. మహబూబాబాద్ జిల్లా విద్యా కేంద్రంగా ఏర్పాటును స్వాగతిస్తూ విద్యార్థులు యువతతో కలిసి ఈ భారీ ర్యాలీని నిర్వహిస్తున్నామని, మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు సీఎం అయితే ఎలా ఉంటుందనడానికి జిల్లాలో ఏర్పాటైన ఈ విద్యాలయాలే అందుకు నిదర్శనం అని మంత్రి పేర్కొన్నారు.
వందేళ్లలో జరగని అభివృద్ధి, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 9 ఏoడ్లలోనే జరిగిందన్నారు. జిల్లా ప్రజలు విద్యార్థుల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.