letter
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

నారా చంద్రబాబునాయుడు కు భద్రత కల్పించాలి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు తెలుగుదేశం లేఖలు

కడపజిల్లా, ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గానికి చెందిన భారతదేశ పౌరులమైన మేము నమస్కరించి వాయునది. తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అవినీతి మచ్చలేని నాయకుడు నారా చంద్రబాబునాయుడు కు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైస్సార్ సిపి ప్రభుత్వం అధికారం తమ చేతుల్లో వుందనే అహంకారంతో, స్వార్థపూరిత కక్షలతో, కుటిల రాజకీయ కుట్రలు పన్ని, నిరాధారమైన నిందారోపణలతో మా నాయకుడు నారా చంద్రబాబునాయుడు పై అక్రమకేసులు పెట్టి కటకటాల వెనుకకు నెట్టేందుకు భయంకరమైన కుట్రపన్నారు.
 కార్యకర్తల ప్రవర్తన మరియు భారతదేశంలో జెడ్ ప్లస్ భద్రత కలిగిన వ్యక్తిని కరుడుగట్టిన తీవ్రవాదులు, నరహంతకులు ఖైదీలుగా వున్న రాజమండ్రి సెంట్రల్ జైలులో సరైన సౌకర్యాలు లేకుండా మా నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారిని వుంచడం పలురకాల అనుమానాలను బలపరుస్తున్న నేపథ్యంలో మీరు చొరవ తీసుకుని చంద్రబాబు నాయుడుకు రక్షణ కల్పించవలసిందిగా కోరారు  రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి దిశలో పరుగులు తీయించి ఇక్కడి యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలెన్నో కల్పించిన మా తెలుగుజాతి ఆస్తిగా ఆరాధించే మా నాయకుడు నారా చంద్రబాబునాయుడు రక్షణ ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత కాబట్టి మీరు ఈ సమస్యపై జోక్యం చేసుకుని ఆ జైలు ప్రాంగణంలో అత్యధిక భద్రతా బలగాలను ఏర్పాటుచేసి, ఆయన బస చేసిన పరిసరాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయవలసిందిగా కోరారు నందమూరి యువసేవాసమితి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి 140 ఉత్తరాలను  రాష్ట్రపతికి తపాలా ద్వారా పంపించిన యీ కార్యక్రమంలో పట్టణ సిబిఎన్ ఆర్మీ ఇన్ఛార్జ్ సిజె.వెంకటసుబ్బయ్య, కడప పార్లమెంటరీ తెలుగుదేశంపార్టీ కార్యదర్శి సి.సిద్ధయ్య, కడప పార్లమెంటరీ తెలుగుదేశంపార్టీ బిసి సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పి.సత్యసాయి సుబ్బరాజు, కడప పార్లమెంటరీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి నాసారి లక్ష్మీనరసింహా, తెలుగుదేశంపార్టీ లీగల్ సెల్ రాష్ట్రప్రధానకార్యదర్శి సి.గుర్రప్పయాదవ్, కడప పార్లమెంటరీ తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి కూనపురి రామునాయుడు తదితరులు పాల్గోన్నారు.