ఏపీ స్కిల్ డెవపల్మెంట్ కేసులో విశాఖ వేదికకగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గు బాటు పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు.చంద్రబాబుపై కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, విచారణ చేస్తున్నది సీఐడీ.. అసలు ఈ వ్యవహారంలో కేంద్ర ప్రమేయం ఎక్కడ ఉంటుంది..? అని ప్రశ్నించా రు.. ఇక, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిస్తే బాగుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారని,జాతీయ పార్టీగా మా అధినాయకత్వం పొత్తులపై నిర్ణయం తీసుకుంటుందని మరో సారి స్పష్టం చేశారు.రాష్ట్రంలో మద్యం సహా ఇతర అక్రమాలు మీద కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు పురంధేశ్వరి.. మద్యం అమ్మకాలు మీద ఒక కమిటీ ని రాష్ట్రానికి పం పాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానని వెల్లడించారు. ఇక, మహిళా బిల్లును సాధ్యం చేసిన ఘనత నరేంద్ర మోడీ సర్కారు దేనంటూ ప్రశంసలు కురిపించారు పురంధేశ్వరి.