revanth
తెలంగాణ రాజకీయం

ఈ నెల 22 న కాంగ్రెస్ బహిరంగ సబ

తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతయిపల్లి గ్రామంలో ఈనెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వజ్రష్ యాదవ్ తెలిపారు. శనివారం తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతయిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లపై పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 22వ తేదీన మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు  చేస్తారని చెప్పారు. అనంతరం అంతయిపల్లి లో లక్ష మందితో భారీ బహిరంగ సభ  నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం పెద్దలకు ఫోన్ ట్యాపింగ్ చేసిన వారికి శిక్ష తప్పదు అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత చేసిన పని మహిళలోకం తలదించుకునే విధంగా ఉందన్నారు అందుకే కవిత బీహార్ జైల్లో ఉందని చెప్పారు. బిజెపి పార్టీ మతపరమైన పార్టీ అని తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టి గెలవాలని చూస్తుందన్నారు. దేవుని పేరు చెప్పుకొని గెలవాలని చూసే పార్టీ అధికారంలోకి రాదని అన్నారు  బిజెపి పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఏం చేసిందని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. 50 నుంచి 80 వేల మెజార్జితో మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తుంకుంట మున్సిపల్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ బలేష్, బీ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, కౌన్సిలర్ల వేణుగోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి , నాయకులు మహేందర్ రెడ్డి, ఎద్దు నాగేష్ తదితరులు పాల్గొన్నారు