pawan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

అక్టోబర్ 1వ తేదీ నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్ర

జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  చేపట్టిన ‘వారాహి విజయ యాత్ర’ నాలుగో విడత కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారు అయింది. కృష్ణా జిల్లాలో  నాలుగో విడత వారాహి యాత్ర  వుంటుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర ప్రారంభం అవుతోంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా ప్రణాళిక సిద్ధమైంది.  పూర్తి షెడ్యూల్ ను తదుపరి సమావేశంలో ఖరారు చేయాలని నిర్ణయించారు