gangula
తెలంగాణ రాజకీయం

ఆహార భద్రతా కార్టు కేవైసీ నింధలను పున:సమీక్షించాలి

కేంద్ర మంత్రికి తెలంగాణ మంత్రి గంగుల లేఖ
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణి శాఖ మంత్రి పియూష్ గోయల్కి తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్  లేఖ రాసారు.
ఆహార భద్రతా కార్డుల్లో కేవైసీ నిబందనల వల్ల నష్టపోతున్న తెలంగాణ పౌరుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ కేంద్రం కేవైసీ నిబందనలను పున:సమీక్షించాల్సిందిగా విజ్ణప్తి చేసారు.
దేశం మొత్తం పరిస్థితులకు తెలంగాణ పరిస్థితులకు గల వైవిద్యం విభిన్నమైనది, దశాబ్దాల కాంగ్రెస్ పాలనా వైఫల్యాల వల్ల సరైన ఉఫాది లేక ఇక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో గల్ఫ్, ఇతర దేశాలతో పాటు దేశంలోని బొంబాయి, బీవండి తదితర ప్రాంతాలకు పెద్ద ఎత్తున వేలాది మంది వలసలు పోయి బతికే దౌర్బాగ్య పరిస్థితులు తలెత్తాయి. ఈ దుస్థితిని రూపుమాపడానికే మా ముఖ్యమంత్రి కేసీఆర్  సారథ్యంలో సుధీర్ఘ పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాము, సాధించిన తెలంగాణను దేశంలోనే అన్ని రంగాల్లో నెంబర్ వన్గా తీర్చిదిద్దుకుంటున్నాము, ఇప్పటికే సాగునీరు, తాగునీరు, పరిశ్రమల ఏర్పాటు తదితర కీలక రంగాల్లో గణనీయమైన వృద్దిని సాధించి మౌళిక వసతులు సహా అన్ని రంగాల్లో దేశానికి మార్గనిర్ధేశకత్వం వహిస్తున్నాము, ఈ కృషితో ప్రస్థుతం వలసలను అరికట్టడంతో పాటు గతంలో వలసపోయిన తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున తిరిగి స్వరాష్ట్రం రావడానికి ప్రోత్సాహమిస్తున్నామని అన్నారు.

ప్రస్థుత కేంధ్రప్రభుత్వ కేవైసీ నిబందనల వల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాలైన కరీంగనర్, నిజమాబాద్, ఆదిలాబాద్, మెదక్ తదితర ప్రాంతాల ప్రజలు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర చోట్లా… దక్షిణ తెలంగాణ ఉమ్మడి జిల్లాలైన మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ తదితర ప్రాంతాల ప్రజలు బొంబాయి తదితర చోట్ల పెద్ద సంఖ్యలో బతుకును వెల్లదీస్తున్నారు. వీరి ప్రయోజనాలు కాపాడడానికి మానవీయ దృక్పథంతో కేంధ్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా పున:సమీక్షించాల్సిన అవసరముందని తమరికి ఈ లేఖ ద్వారా గుర్తు చేస్తున్నానని పేర్కోన్నారు.