dammaiguda
తెలంగాణ రాజకీయం

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛత హీసేవ కార్యక్రమంలో భాగంగా చైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో గల ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతంలో ప్రజలకు తడి చెత్త పొడి చెత్తను మున్సిపల్ వాహనానికి అందించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తడి పొడి చెత్తను ప్లాస్టిక్ సంబంధించిన వ్యర్ధాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రామరం శ్రీహరి గౌడ్, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, కాలనీవాసులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.