సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి..సీఎం కేసీఆర్ ఫై ప్రశంసలు కురిపించారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన నిర్మాణ పనుల పట్ల హర్షం వ్యక్తం చేసారు. సంగారెడ్డి లో మెడికల్ కాలేజీ రావడానికి సీఎం కేసీఆర్ సహకారం ఉందని , అసెంబ్లీ లో పలుమార్లు మెడికల్ కాలేజీ గురించి అడిగానని, దానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఇక్కడ మెడికల్ కాలేజీ రావడం వల్ల చుట్టుపక్కల పెద ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.
ఇక్కడే అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు దొరుకుతాయి అన్నారు. గాంధీ, ఉస్మానియా కి దీటుగా ఈ కాలేజీ ఉంటుందని జగ్గారెడ్డి అన్నారు. అలాగే ఇక్కడికి వచ్చే పేషెంట్ అటెండర్స్ కి రాత్రి పడుకోవడానికి సౌకర్యం కల్పించాలని ఆరోగ్య మంత్రి హరీష్ రావు ను కోరతానని తెలిపాడు. స్వయంగా కేసీఆర్ వచ్చి ఆస్పత్రిని ప్రారంభిస్తారని, పార్టీలు ఏవైనా ఏమైనా పని జరగాలంటే అందరి సహకారం కావాలి అన్నారు. సంగారెడ్డి ప్రజలకు ఈ కాలేజీ ఓ వరంలాంటిదన్నారు.