దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అత్యధిక స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా గత రెండు రోజుల్లో నష్టాలనెదుర్కొన్న సూచీలు బుధవారం పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతోఆరంభంలో 200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 129 పాయింట్ల లాభంతో 52648 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు ఎగిసి15,790 వద్ద ట్రేడవుతోంది.
ఆటో, ఐటి, ఎఫ్‌ఎంసిజి, మీడియా, ఫార్మా, పిఎస్‌యు బ్యాంక్ సూచీలు లాభపడు తుండగా, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్ రియాల్టీ రంగాలు నష్టపోతున్నాయి. ముఖ్యంగా అబుదాబిలోని రువైస్‌లో పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీతో ఒప్పందం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లాభపడుతోంది. క్లోర్-ఆల్కలీ, ఇథిలీన్ డైక్లోరైడ్, పాలీ వినైల్ క్లోరైడ్ (పివిసి)ను తయారు చేస్తుంది. మారుతి సుజుకి, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హిందాల్కో, జెఎస్‌డబ్ల్యు స్టీల్, టైటాన్, ఇన్ఫోసిస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా స్టీల్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభాలలో ఉన్నాయి. పవర్ గ్రిడ్, ఎన్‌టిపిసి, ఐసిఐసిఐ బ్యాంక్ ఇండస్‌ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, శ్రీ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, హిందుస్తాన్ యూనిలీవర్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐషర్ మోటార్స్ నష్టపోతున్నాయి.