కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛతహీసేవా “కార్యక్రమంలో భాగంగా చైర్ పర్సన్ శ్రీమతి వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో “స్వచ్ఛతహీసేవా “ లో భాగంగా ఈ రోజు దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ సిబ్బందికి Health Camp నిర్వహించి సిబ్బంది కి మందులు పంపిణి చేయడం జరిగింది మరియు ఈరోజు దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని నాసిన్ చెరువు లో ప్లాస్టిక్ సంబంధించిన వ్యర్ధాలను మరియు చెత్త ను తొలగించడం జరిగింది. చెరువు పరిసరాల ప్రాంతాల పరిశుభ్రత పై అనారోగ్య సమస్యలు రాకుండా ప్రజలకు అవగాహన కలిపించారు . .
ఈ కార్యక్రమమం లో చైర్ పర్సన్ శ్రీమతి వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ S.రాజ మల్లయ్య, వైస్ చైర్మెన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి , మున్సిపల్ A.వెంకటేశం,కౌన్సిలర్ రామారం శ్రీహరి గౌడ్, మునిసిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభు, డాక్టర్ సరిత, డాక్టర్ సాయిఆకాంక్ష , డాక్టర్ వెంకన్న , మున్సిపల్ సిబ్బంది, కాలని వాసులు పాల్గొనడం జరిగింది.