రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ చంద్రబాబుపై ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు వెంటే ఉన్నారని టిడిపి నేతలు పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలో “బాబుతో… నేను” అంటూ పోస్ట్ కార్డులను ప్రదర్శించి స్థానిక పోస్ట్ ఆఫీస్ నందు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చంద్రబాబుకు మద్దతుగా పోస్టు కార్డులను పంపించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ… చంద్రబాబుకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక జగన్ అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైలుకు పంపారని మండిపడ్డారు. చంద్రబాబు “విజన్” ఉన్న నాయకుడని, జగన్ మాత్రం”రీజన్” లేని నాయకుడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన హయాంలో.. నిరుద్యోగ యువతకు ఏడాదికి కనీసం 25 లక్షల ఎంట్రీ ప్యాకేజీ తో.. ఉద్యోగాలు కల్పించడానికి “స్కిల్ డెవలప్ మెంట్” పాలసీని అమలు చేస్తే ..! జగన్ మాత్రం తన పాలనలో డాక్టర్ సుధాకర్ మొదలుకొని అన్ని వర్గాల ప్రజలను దమనకాండ కు పాల్పడుతూ…*”కిల్ డెవలప్ మెంట్” చేశారని ఆరోపించారు.
ఇక వైసిపి కి రోజులు దగ్గర పడ్డాయని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా! అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అవినీతి మరకలు లేకుండా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని పేర్కొన్నారు. వైసీపీని గద్దె దించేంతవరకు మా పోరాటం ఆగదని టిడిపి నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరవీటి సుధాకర్ శెట్టి, కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి. అల్తాఫ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప్పర (సగర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి కురువ సాధికారిక కమిటీ సభ్యులు అడ్వకేట్ కే.టి. మల్లికార్జున, ఎమ్మిగనూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మాచాని శివకుమార్, ఎమ్మిగనూరు మండలం మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, జిల్లా తెలుగు మహిళ నాయకురాలు అగ్రహారం పార్వతమ్మ, గోకారమ్మ, ఎరుకల మారెన్న, ఎస్.బి.లక్ష్మన్న, టిడిపి ముస్లిం మైనార్టీ నాయకులు కె.యం.డి. అబ్దుల్ జబ్బర్, మదిరె పీర్ భాష, కడివెళ్ల బడే సాబ్, ఆఫ్గాన్ వలి భాష, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు రోజా ఆర్ట్స్ ఉసేని, దర్జీ మోషన్న, అల్వాల ప్రసాద్, ఎమ్మిగనూరు మండలం టిడిపి నాయకులు మల్కాపురం పురుషోత్తం రెడ్డి, మాసుమాన్ దొడ్డి శ్రీనివాసులు, కె. తిమ్మాపురం గ్రామ టిడిపి నాయకులు ఉప్పర వీరేష్, బి. టి.చిన్న హనుమంతు, బోయ రంగన్న, చాకలి శివమణి, మాల మల్లికార్జున, లింగన్న, కందనాతి టిడిపి నాయకులు డీలర్ లక్ష్మన్న, నందవరం మండలం నాగలదిన్నె సత్యన్న తదితరులు పాల్గొన్నారు