liquor
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

లైసెన్సులు మరో  ఏడాది

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మద్యం షాపుల గడువు ముగియనుంది.. అక్టోబర్‌తో మద్యం దుకాణాల గడువు ముగుస్తుంది.. అయితే.. షాపులకు కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. మద్యం షాపుల కాలపరిమితిని మరో ఏడాది పొడిగిస్తున్నట్టు జీవో ఎంఎస్ నెంబర్‌ 466ను జారీ చేశారు అబ్కారీ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ.. ఏపీ స్టేట్‌ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ ప్రతిపాదనల మేరకు ఈ ఏడాది కూడా గతేడాది లాగే 2,934 షాపులను కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.కాగా, ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్ ఇచ్చిన హామీ దశలవారీగా మద్యపాన నిషేధం.. కానీ, అది కార్యరూపం దాల్చలేదనే విమర్శలు గున్నాయి.. ఇదే సమయంలో.. ప్రైవేటు దుకాణాలను మూసి వేయించిన జగన్‌ సర్కార్‌.. నూతన లిక్కర్‌ పాలసీ తీసుకువచ్చి.. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతోంది.. అనేక రకాల నూతన బ్రాండ్ ల మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

మద్యం సామాన్యులకు దూరం చేయాలన్న ఆలోచనా..? ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలన్న తపనా..? అనే చర్చ తర్వాత విషయం.. కానీ.. ప్రభుత్వం మద్యం ధరలను అమాంతం పెంచేసింది.. బెల్టు షాపులను రద్దు చేసింది. విడతల వారీగా మద్యం దుకాణాలను, మద్యం విక్రయాలను తగ్గించడమే తమ టార్గెట్‌గా చెబుతున్నారు.. ప్రతి ఏటా 25 శాతం మధ్య దుకాణాలను ఎత్తివేసే ప్రణాళికలను రూపొందించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఈ ఏడాది కూడా గతేడాది లాగే 2,934 షాపులను కొనసిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి