kavita-arvind
తెలంగాణ రాజకీయం

కవిత జైలుకు పోవడం ఖాయం

కవిత కేసీఆర్ పేరు నిలబెట్టి లిక్కర్ బోర్డు తెచ్చారు. డ్రగ్స్ మార్కెటింగ్ లో కేటీఆర్  బ్రాండ్ అంబాసిడర్. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్, కవిత లు ఎక్కడున్నారని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ ఆరోపించారు. సోమవారం అయన నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రేపో మాపో కవిత జైలుకు వెళ్లడం ఖాయం. కవిత ముందే కేటీఆర్ జైలుకు పోయినా ఆశ్చర్య పోనవసరం లేదు. మున్సిపల్ సిబ్బంది అంగన్ వాడిలు ఆశా వర్కర్లు ఎన్నికల్లో ఇంటికి పంపిస్తారు. కేటీఆర్ ప్రధాని గురించి మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నిజామాబాద్ నుంచే మార్పు మొదలవుతుంది. పసుపు బోర్డు ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయం. ప్రధానికి హోంమంత్రి అమిత్ షా లకు వీలున్న ప్రతీసారీ గుర్తు చేశాం. మోడీ హయాంలో పసుపు బోర్డు రావడం శుభపరిణామం. చాలా చోట్ల పసుపు రైతు సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఆశీర్వాద తీర్మానాలు చేస్తున్నారు. ప్రధాని సభకు పసుపు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.