jagan-pawan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఫైర్

కురుక్షేత్ర యుద్ధం.. కౌరవులు.. పాండవులు.. ఇదే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన రాజకీయం.. రాబోయే ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణించిన సీఎం జగన్‌ కామెంట్స్‌తో ఈ కాక రేగింది. ఆయనకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ వారాహి యాత్రలో పాల్గొన్న పవన్‌ పంచ్‌ డైలాగులతో ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కౌరవులెవరో.. పాండవులెవరో సీఎం జగన్‌ తేల్చుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ సూచించారు. యువతను మోసం చేసిన వైసీపీని గద్దె దించడమే లక్ష్యమన్న ఆయన.. రాబోయే రోజుల్లో జనసేన-టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు.అయితే, పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాని వ్యక్తి అంటూ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. బీజేపీతో ఉంటూనే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. జనసేన కార్యకర్తలు.. జనసైనికులు కాదు.. సైకిల్ సైనికులు అంటూ ఎద్దెవా చేశారు.

చంద్రబాబు అవినీతి డబ్బుతో వారాహి యాత్ర జరుగుతోందని అంబటి ఆరోపించారు.పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాలని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ హెచ్చరించారు. వైసీపీకి 15 సీట్లు వస్తాయంటున్న పవన్‌ కల్యాణ్‌.. వచ్చే ఎన్నికల్లో కనీసం 15 సీట్లలోనైనా పోటీ చేయగలరా అని ప్రశ్నించారు. పవన్‌కు దమ్ముంటే 175 సీట్లలో అభ్యర్ధులను నిలబెట్టాలని సవాల్‌ చేశారు. అవినీతి పరుడైన చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న పవన్‌ కల్యాణ్‌కు.. వైఎస్‌ జగన్‌ను విమర్శించే హక్కులేదని వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.అవనిగడ్డలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలకు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు కౌంటర్‌ ఇచ్చారు.

ఈసారి వైసీపీకి 15 సీట్లు వస్తే గొప్ప అంటూ పవన్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ పేర్కొన్నారు. తాను ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో పవన్‌కే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఎంతమంది వచ్చినా వైసీపీకి తిరుగులేదని.. వైసీపీకి 15 సీట్లు వస్తే గొప్ప అన్న పవన్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ పేర్కొన్నారు. ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో పవన్‌కే క్లారిటీ లేదని.. అసలు జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయని పేర్కొన్నారు.