padayatra
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చంద్రబాబుకు అడ్డంకులు తొలిగి విడుదల అవ్వాలని కోరుతూ గండేపల్లి నుండి అన్నవరం దేవస్థానం వరకు  పాదయాత్ర

టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ ఆయన సత్య శీలుడుగా విడుదల అవ్వాలని కోరుతూ గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు, కాకినాడ జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు కోర్పు సాయి తేజ ఆధ్వర్యంలో గండేపల్లి మరిడమ్మ ఆలయం నుండి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం కు పాదయాత్రను రాష్ట్ర టిడిపి కార్యదర్శి కోర్పు లచ్చయ్య దొర, జండా ఊపి ప్రారంభించారు జగ్గంపేట చేరుకున్న పాదయాత్రకు. జగ్గంపేటలో రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పాదయాత్ర బృందానికి స్వాగతం పలికి వారితో సంఘీభావంగా జగ్గంపేట చివరి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పోతుల మోహనరావు, కోర్పు సాయి తేజ ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు చంద్రబాబు కి అనుకూలంగా రావాలని ఆ సత్య దేవుని ప్రార్థించేందుకు గండేపల్లి నుండి సుమారు 60 కిలోమీటర్లు అన్నవరం వరకు పాదయాత్ర చేస్తున్నారని వారికి సంపూర్ణ మద్దతు వారి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఈ పాదయాత్రలో అన్నవరం వెళ్తున్నవారు. గారపాటి గంగాధర్ చౌదరి, ఇప్పర్ల సురేష్, వెంపాటి సతీష్, వెంపాటి నాని, పసుమర్తి సుబ్రమణ్యం, నిమ్మలపూడి మహేంద్ర, దా రా చిట్టి శేఖర్, అంబటి సుబ్బారెడ్డి, జంగా రామకృష్ణారెడ్డి, పిల్లి వెంకటరమణ, బొల్లిన గంగాధర్, పల్లి సత్యనారాయణ రెడ్డి, పల్లి మణికంఠ రెడ్డి, ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన వారు. ఎస్సిఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, బొల్లాoరెడ్డి రామకృష్ణ, వెలమాటి కాశి, వెంపాటి రాజు, వెంపాటి రాంబాబు, దారా కాటయ్య, బొగతా నూకరాజు తదితరులు పాల్గొన్నారు.