sarees
తెలంగాణ రాజకీయం

బతుకమ్మ చీరలపై మహిళల ఆగ్రహం

బతుకమ్మ చీరలను మహిళలు విసిరేసారు. నాణ్యత లేని చీరలు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేసారు. కేసిఆర్ కుటుంబ సభ్యులు ఇలాంటి చీరలు కట్టుకుంటారా అంటూ నిలదీసారు.  వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలం పెద్ద మునగాల గ్రామ పంచాయితీలో బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న  మహిళలలు బతుకమ్మ చీరలు చూసి అసహనం వ్యక్తం చేసారు. నాణ్యత లేని చీరెలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు..బతుకమ్మ చీరలు  బొంతలకి , తాళ్ళకి నారుమళ్లు దగ్గర బెదురు పెట్టడానికి వాడుకుంటున్నామన్నారు.  నాసిరకం చీరలు మాకు వద్దని అందరు చీరెలను విసిరేసి కేసిఆర్,  మీ కవితమ్మను ఈ చీరెలు కట్టోకోమని చెప్పు,  పేద అడపడచులు అంటే ఇంత చిన్న చూపా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. 3 సంవత్సరాల నుంచి ఇచ్చిన చీరలు అలానే వున్నాయని ఎవరు కట్టుకోవడం లేదని   తీవ్రంగా విమర్శించారు.