2000 note
జాతీయం ముఖ్యాంశాలు

నేటితో ముగియనున్న రూ. 2000 నోట్ల‌ చలామణి చ‌లామ‌ణిలో ప్ర‌స్తుతం రూ. 12,000 కోట్ల విలువైన 2000 నోట్లు

రూ. 2000 నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు రేప‌టితో గ‌డువు ముగుస్తుండ‌టంతో ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ శుక్ర‌వారం కీల‌క‌ ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం రూ. 12,000 కోట్ల విలువైన (3.37 శాతం) 2000 నోట్లు చ‌లామ‌ణిలో ఉన్నాయని ఆయ‌న పేర్కొన్నారు. రూ. 2000 నోట్ల‌లో 96 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్య‌వ‌స్ధ‌కు వ‌చ్చాయ‌ని చెప్పారు.ఇప్ప‌టివ‌ర‌కూ రూ. 3.43 ల‌క్ష‌ల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు బ్యాంకుల‌కు చేరాయ‌ని కేవ‌లం రూ. 12,000 కోట్ల విలువైన నోట్లు మిగిలిఉన్నాయ‌ని శ‌క్తికాంత దాస్ తెలిపారు. 87 శాతం బ్యాంక్ డిపాజిట్లుగా వ‌చ్చాయ‌ని, మిగిలిన‌వి ఇత‌ర నోట్ల‌తో ఎక్స్ఛేంజ్ చేసుకున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు.రూ. 2000 నోటును ఉప‌సంహ‌రిస్తున్న‌ట్టు ఆర్బీఐ మే 19న వెల్ల‌డించే నాటికి రూ. 3.56 ల‌క్ష‌ల కోట్లు వ్య‌వ‌స్ధ‌లో ఉండగా, ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ రూ. 3.44 ల‌క్ష‌ల కోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్య‌వ‌స్ధ‌లోకి తిరిగివ‌చ్చాయ‌ని చెప్పారు. ఇక అక్టోబ‌ర్ 8 నుంచి బ్యాంకులు రూ. 2000 నోట్లను ఖాతాల్లో జ‌మ‌చేయ‌డం, లేదా ఇత‌ర బ్యాంక్ నోట్లతో ఎక్స్ఛేంజ్‌ను నిలిపివేస్తాయ‌ని ఆర్బీఐ పేర్కొంది.