modi-israel pm
అంతర్జాతీయం

ఇజ్రాయిల్ కు అండగా ఉంటాం

ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూతో భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్‌కాల్ లో మాట్లాడారు. ఇజ్రాయిల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఖండిస్తోందని నరేంద్రమోడీ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.నెతన్యాహుతో ఫోన్ కాల్ లో మాట్లాడానని, ఈ క్లిష్ట సమయంలో భారత్ ఇజ్రాయిల్ కి అండగా ఉంటుందని, భారతదేశం అన్ని రూపాల్లోని తీవ్రవాదాన్ని ఖండిస్తోందని పోస్టు చేశారు. అంతకుముందు శనివారం ఇజ్రాయిల్‌పై హమాస్ మెరుపుదాడి తర్వాత భారత ప్రధాని మోడీ ఇజ్రాయిల్ కి అండగా ఉంటామని ప్రకటించారు. చాలా మంది ప్రజలు చనిపోవడం తనను షాక్‌కి గురిచేసిందని అన్నారు.

ఇజ్రాయిల్, హమాస్ పోరులో ఇప్పటి వరకు 1600 మంది చనిపోయారు. హమాస్ దాడిలోొ 900 మంది ఇజ్రాయిల్ పౌరులు చనిపోగా.. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో 700 మందికి పైగా ప్రజలు మరణించారు. మరోవైపు తీవ్ర ఉగ్రదాడికి గురైన ఇజ్రాయిల్ కి పలు దేశాలు అండగా నిలుస్తున్నాయి. అమెరికా, యూకే, భారత్, జర్మనీ, కెనడా దేశాధినేతలు అండగా ఉంటామని ప్రకటించాయి