congress
తెలంగాణ రాజకీయం

కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్

రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది… పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణమంటున్నారు… దాంతో ఎడతెగని కసరత్తుతో నేతలు మల్లగుల్లాల పడుతున్నారంట.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది… ఇప్పటికే బీఆర్ఎస్ 115 మందితో తన అభ్యర్ధులు జాబితా రిలీజ్ చేసింది… అయితే బీఆర్ఎస్ కు ధీటైన పోటీ ఇస్తామంటున్న కాంగ్రెస్ లో ఆ పరిస్థితి కనిపించలేదు … తాజాగా ఎనిమిది గంటల పాటు సాగిన కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో కేండెట్ల  వడపోత పూర్తికాలేందంట… దాంతో కమిటీ మరోసారి భేటీకి సిద్దమవుతోంది … ఆ క్రమంలో
వామపక్షాలతో పొత్తు అంశం బాధ్యతలు భట్టికి అప్పగించారంట
వాయిస్
మొత్తమ్మీద రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక మరింత ఆలస్యం కానుంది … పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదంట… ఏకాభిప్రాయం వచ్చిన వారి వివరాలను కమిటీ సీఈసీకి సమర్పించనుంది … ఢిల్లీ కాంగ్రెస్‌ వార్‌ రూంలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం దాదాపు 8 గంటలకు పైగా కొనసాగింది.చైర్మన్‌ మురళీధరన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు బాబా సిద్ధిఖీ, జిగ్నేష్‌ మేవానీ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధు యాస్కీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌ చౌదరి, పీసీ విష్ణునాథ్‌, మన్సూర్‌ అలీఖాన్‌, పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు పాల్గొన్నారు … అభ్యర్థుల వడపోతపై సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ సాగిందంట. విశ్వసనీయ సమాచారం ప్రకారం…. సుమారు 70కుపైగా నియోజకవర్గాల విషయంలో సభ్యుల మధ్య స్వల్పమైన బేధాభిప్రాయాలు మినహా చర్చ సజావుగానే సాగిందంటున్నారు

మిగతా అభ్యర్థుల ఎంపికలో కమిటీలోని ఏ ఇద్దరూ ఒకే రకమైన అభిప్రాయం వ్యక్తం చేయకపోవడంతో ఒక్కో స్థానంపై సుదీర్ఘ చర్చసాగిందట…. తొలుత ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల విషయంలో సమతౌల్యం పాటించాలని కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన చేసినందున ఆయా రిజర్వుడు కేటగిరీల్లోని వర్గాల మధ్య తేడాలు రాకుండా చూడాలని నిర్ణయించారు. బీసీలకు 34 టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చినందున ఆ సంఖ్య తగ్గకుండా చూసేందుకు కసరత్తు చేస్తున్నాంట.

వాయిస్
అయితే ఎనిమిది గంటలకు పైగా చర్చించినా అభ్యర్థుల వడపోత పూర్తి కాలేదు .. దాంతో ఛైర్మన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారంటున్నరు.. ఒక నియోజకవర్గంలో పార్టీకి విధేయత, సుదీర్ఘ కాలం పని చేయడం వంటి అంశాలను సమర్థించిన సభ్యులు మరో నియోజకవర్గంలో అందుకు పూర్తి విరుద్ధంగా గెలుపే లక్ష్యమంటూ మాట్లాడడంతో కనీసం 30 చోట్ల తుది నిర్ణయానికి రాలేకపోయారట …. సుమారు పది నియోజకవర్గాలపై చర్చ అసలు ఏమాత్రం ముందుకు సాగలేదంటున్నారు… ఈ నేపథ్యంలో సమావేశం అనంతరం ఛైర్మన్‌ మురళీధరన్‌.. కమిటీ సభ్యులతో విడివిడిగా సమావేశమయ్యారు .. అభ్యర్థుల ఎంపికపై వారి అభిప్రాయాలు స్వీకరించారు.

వామపక్షాలతో పొత్తు ఉండాలా వద్దా.. ఉంటే ఎన్ని సీట్లు ఇవ్వాలనే బాధ్యతను కమిటీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అప్పగించినట్లు తెలిసింది… స్క్రీనింగ్‌ కమిటీ నుంచి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి  పలు నియోజకవర్గాల నుంచి ఒకే పేరు రావడంతో రాహుల్‌ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది… ‘ఒకే పేరు రావడానికి కారణం ఏమిటి..? మరో నాయకుడే లేడా..? ఎవరైనా అడ్డుకుంటున్నారా? ఒకవేళ నిజంగా ఆ స్థాయి నాయకుడు లేకుంటే ప్రత్యర్థి పార్టీలో వీరికి దీటుగా ఉన్న నాయకులు ఉంటే వారి  పేరునైనా స్క్రీనింగ్‌ కమిటీ సీఈసీకి పంపాలని రాహుల్‌  ఆదేశించినట్లు  తెలిసింది. … దాంతో తెలంగాణ కమిటీ ఒకే దరఖాస్తు వచ్చిన నియోజకవర్గాల్లో మరో  పేరును జత చేసినట్లు సమాచారం. అవసరమైతే మరోసారి ఆయా నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వాయిస్
కమిటీ సమావేశం అనంతరం మాణిక్‌రావు ఠాక్రే  విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లకు సంబంధించి సీఈసీ సమావేశాలు సాగుతున్నాయి. వాటి తర్వాత తెలంగాణ సమావేశం జరగవచ్చు. ఓబీసీ, ఓయూ విద్యార్థులు, పార్టీ అనుబంధ సంస్థల నుంచి వచ్చిన దరఖాస్తులు పరిశీలించాం. సీఈసీ భేటీ తర్వాతే స్క్రీనింగ్‌ కమిటీ మరోసారి సమావేశమవుతుంది. స్క్రీనింగ్‌ కమిటీ ప్రతి సమావేశంలో కొన్ని కొత్త పేర్లు జత కావొచ్చని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన తమకు కాంగ్రెస్‌ టికెట్లు కేటాయించాలంటూ ఓయూ విద్యార్థి నేతలు డిమాండ్‌ చేస్తున్నారు… సమావేశం సాగుతున్న సమయంలో వార్‌ రూం ఎదుట వారు ఆందోళన చేశారు. 2014, 2018 ఎన్నికల్లోనూ తమకు టికెట్ల విషయంలో అన్యాయం జరిగిందని వాపోయారు… ఈ సమయంలో సీడబ్ల్యూసీ సభ్యుడు జితేంద్ర సింగ్‌ వార్‌ రూం నుంచి బయటకు వచ్చి.. గెలిచే అవకాశాలున్న వారికి టికెట్లు ఇస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు… మరి ఇన్ని తలనొప్పుల మధ్య కాంగ్రెస్ లిస్ట్ ఎప్పటికి ఫైనల్ అవుతుందో చూడాలి…