పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఇవాళ మధ్యాహ్నం పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శానంపూడి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ వెళ్లారు. నిన్న కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించేందుకు వచ్చానని తెలిపారు. సీఎం కేసీఆర్ సూచన మేరకే పొన్నాల ఇంటికి వచ్చానని పేర్కొన్నారు. పార్టీలో చేరేందుకు పొన్నాల సుముఖత వ్యక్తం చేశారు. ఆయనకు బీఆర్ఎస్‌లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రేపు పొన్నాల సీఎం కేసీఆర్‌ను కలుస్తారు.
సీఎంను కలిసిన తర్వాత పొన్నాల తుది నిర్ణయం ప్రకటిస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీకి పొన్నాల ఎంతో సేవ చేశారని మంత్రి గుర్తు చేశారు. సీనియర్లకు కాంగ్రెస్ పార్టీలో కనీసం గౌరవం లేకుండా ఇవ్వడం లేదు. పొన్నాలను రేవంత్ తూలనాడిన విధానం హీనసంస్కారానికి నిదర్శనం. కనకపు సింహాసనంపై ఓటుకు నోటు దొంగను కూర్చోబెట్టారు అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.