jagan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

విశాఖలో సీఎం జగన్ పర్యటప

డిశంబర్ నుంచి రాష్ట్ర పాలనవ్యవహారాలు విశాఖ నుంచి చేపడతానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. విశాఖలోని మధురవాడ ఐటి హిల్స్ లో ఇన్ఫోసిస్ డవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన ఆయన విశాఖ అద్భుతమైన నగరమని వర్ణించారు… ఏపిలో ఒక ముఖ్యపట్టణంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు
కలిగివుందన్నారు..దేశంలోని ప్రధాన పట్టణాలతో పోలిస్తే రెండో శ్రేణి నగరంగా వున్నప్పటికి అన్ని హంగులు విశాఖ వున్నాయన్నారు.ఇటు వంటి నగరం నుంచి పాలన చేయడం ఒకగర్వకారణమన్నారు..
ఇన్ఫోసి కంపెనీ అడుగు పెట్టడంతో ఏపి ఐటి భవిష్యత్తుకు ఒక మంచి సంకేతమన్నారు…మరిన్ని ప్రఖ్యాత ఐటి కంపెనీలు కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కలలను
సాకారం చేసుకోడానికి విశాఖపట్నం ఒక గమ్యస్ధానమన్నారు…..
అనంతరం ఇన్ఫోసిస్ ప్రతినిధులతో బోర్డ్ రూమ్లో సమావేశమయ్యారు…. ఇన్ఫోసిస్ ఉద్యోగులతో ముఖాముఖీ అయ్యారు…ఆంఫీథియేటర్ లో ముఖ్య ఇన్ఫోసిస్ ముఖ్య ఆర్థిక విభాగం అధికారి  నీలంజన్
రాయ్ సంభాషించారు..
ఈ కార్యక్రమంలో పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాధ్, భీమిలి ఎమ్మెల్యే అవంతీ శ్రీనివాసరావు, నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు..