తెలంగాణలో టికెట్ రాని కాంగ్రెస్ నేతల ఆందోళనలతో గాంధీభవన్ అట్టుడికింది … కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది … అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తాజాగా 55 మంది అభ్యర్థులను ప్రకటించింది … ఈ క్రమంలో మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్ తదితర నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు … రేవంత్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమమవ్వడం పార్టీలో కాక రేపుతోంది.
తెలంగాణలో సగం మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది .. అంతే హస్తం పార్టీలో అసంతృప్తుల సెగ మొదలైంది… కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ప్రకంపనలు సృష్టించడం మొదలుపెట్టింది …. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 119 సీట్లకుగాను కాంగ్రెస్ తాజాగా 55 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం విధితమే … ఈ క్రమంలో మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్ తదితర నియోజకవర్గాలలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు
వాయిస్
అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకీ పలు నియోజకవర్గాల్లో నిరసన ఎదురైంది. టికెట్ ఆశించి భంగపడిన కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేయగా.. మరికొందరు పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు …ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీకీ పలు నియోజకవర్గాల్లో నిరసన ఎదురైంది.
గాంధీ భవన్ వద్ద ఏకంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దహనం చేయడం గమనార్హం …. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులకు ఈ పరిణామాలు మింగుడుపడటం లేదంట.. నిరసనలు పెరగడంతో ఆందోళనకారులు లోపలకు రాకుండా గాంధీభవన్ సిబ్బంది లోపలి ప్రవేశద్వారాలకు తాళాలు వేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు…
ఉప్పల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు … ఉప్పల్ నుంచి గత ఎన్నికల్లోనూ ఆయన టికెట్ కోరారు.. అధిష్ఠానం తన సేవలను గుర్తించి ఈసారి టికెట్ ఇస్తుందని గట్టిగా విశ్వసించారు… నియోజకవర్గంలో విస్తృత ప్రచారం కూడా చేశారు .. బస్తీ నిద్రలు చేశారు … ఇక్కడ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షుడు పరమేశ్వర్‌రెడ్డికి టికెట్ రావడంతో రాగిడి తీవ్ర నిరాశకు గురయ్యారు… తాజాగా తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంటతడి పెట్టి ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు … రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు.
ఇదే నియోజకవర్గం టికెట్ ఆశించిన పార్టీ బీ బ్లాక్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, ఆయన భార్య, ఏఎస్‌రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీషారెడ్డిలు కాంగ్రెస్‌కు రాజీనామా ప్రకటించారు … రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉండే సోమశేఖర్‌రెడ్డి.. తనకు తప్పకుండా టికెట్ వస్తుందని ఆశించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమశేఖర్‌రెడ్డి దంపతులు మాట్లాడుతూ.. రేవంత్ హఠావో, కాంగ్రెస్ బచావో నినాదంతో ముందుకు వెళ్తామని ప్రకటించారు.
అలాగే మేడ్చల్ టికెట్ ఆశించి భంగపడిన సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి కీసరలో అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు … ఇక్కడ టికెట్ దక్కిన తోటకూర వజ్రేశ్‌యాదవ్.. ఈ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లడంతో హరివర్ధన్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది… దీంతో వజ్రేశ్‌యాదవ్ అక్కడి నుంచి వెనుదిరిగారు.
వాయిస్
బహదూర్‌పుర టికెట్ తనకు ఇవ్వలేదని ఖలీమ్‌బాబా, చాంద్రాయణగుట్ట టికెట్ దక్కలేదని షకీల్ దయానిలు అనుచరులతో గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు. అదే సమయంలో గాంధీభవన్‌కు వచ్చిన పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవిని ఘెరావ్ చేశారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా మీడియా హాలులోకి చొచ్చుకువచ్చి అడ్డుకున్నారు. దీంతో మల్లు రవి విలేకరుల సమావేశాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు… గద్వాల టికెట్ ఆశించి భంగపడ్డ ఓయూ జేఏసీ నాయకుడు డా.కురువ విజయ్‌కుమార్ తన అనుచరులతో గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సగం టికెట్లు ప్రకటించే ఇంత ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ లో… మొత్తం అభ్యర్ధులను ప్రకటిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి