tel cong
తెలంగాణ రాజకీయం

మెదక్ సీట్ల కోసం ఢిల్లీ స్థాయిలో…

మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాలకు 5 స్థానాలకు కాంగ్రెస్ తొలిజాబితాలో అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన స్థానాల్లో పోటీకి అభ్యర్థులు దిల్లీలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణ శాసనసభకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది అభ్యర్థులను ప్రకటించగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజక వర్గాలకు 5 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాగా మిగిలిన 5 నియోజకవర్గాలకు, రెండో జాబితాలో స్థానం ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి ) నాలుగోసారి గెలుపే లక్ష్యంగా పోటీ చేయనున్నారు. 2004లో తొలిసారిగా ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2009 లో కాంగ్రెస్ తరుపున బరిలో నిలిచి విజయం సాధించారు. 2014లో చింతా ప్రభాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు.

2018 లో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ పై విజయం సాధించారు. ఇప్పుడు మరల ఆయనకు అవకాశం దక్కిoది.ఆందోల్ నియోజకవర్గం నుంచి దామోదర రాజనర్సింహను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. 1989లో ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1994,1999 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. 2004, 2009 ఎన్నికలలో పోటీచేసి విజయం సాధించారు. ఇతను మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. మరల 2014, 2018 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. దామోదర రాజనర్సింహ ఎనిమిదోసారి కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి దిగనున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత ఏ. చంద్రశేఖర్ తొలిసారిగా బరిలో నిలిచారు. ఆయన వికారాబాద్ నుంచి 1985లో టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. 1989 నుంచి 2004 వరకు వికారాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2008లో జరిగిన ఉపఎన్నికలో మరల 2009లో జరిగిన సాధారణ ఎన్నికలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో నిరాశే మిగిలింది. మాజీ మంత్రి గీతారెడ్డి జహీరాబాద్ నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించడంతో.. చంద్రశేఖర్ కు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందిగజ్వేల్ నియోజకవర్గం నుంచి తూంకుంట నర్సారెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇతను సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్ మీద ఈయన ఈసారి పోటీ చేయనున్నారు.

2014 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు నర్సారెడ్డికి అవకాశం దక్కిoది. మెదక్ నియోజకవర్గం నుంచి మైనంపల్లి రోహిత్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. నారాయణఖేడ్, నరసాపూర్, సిద్దిపేట, పటాన్ చెరు, హుస్నాబాద్ నుంచి సీటు ఆశిస్తున్నా కాంగ్రెస్ నాయకులందరూ దిల్లీలో టికెట్ తెచ్చుకునే ప్రయత్నాలలో ఉన్నారు.