అమరవీరుల స్థూపం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని రేవంత్ సవాల్ చేశారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్తూపం వద్దకు రేవంత్ రెడ్డి చేరుకున్నారు.దీంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎలక్షన్ కోడ్ ఉన్నందునే అనుమతించడం లేదన్నారు పోలీసులు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ కార్యాలయానికి వచ్చి అక్కడి నుంచి ఒంటిగంటకు అమరవీరుల స్తూపం వద్దకు రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు.మరోవైపు రేవంత్‌రెడ్డి నివాసానికి బోధ్ ఎమ్మెల్యే బాబూరావు రాథోడ్ వచ్చారు. బోధ్ అసెంబ్లీ టికెట్‌ను అనిల్ జాదవ్‌కు భారాస ఇచ్చిన నేపథ్యంలో.. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణం చేద్దామని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.