జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ సాదకా భాధకాల్లో పాలు పంచుకుంటూ
కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రచారంలో అందరికంటే ముందుగా దూసుకుపోతున్నారు.
జగిత్యాల టౌన్, జగిత్యాల అర్బన్, రూరల్, రాయికల్, సారంగాపూర్, బిర్పూర్ మండలాల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి విసతృతంగా తిరుగుతూ ఆరు గ్యారంటీల గూర్చి ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ప్రజలకు చేరువవుతున్నారు.
బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులు, యువకులు,రైతులు, ఉద్యోగులు, మహిళలు, పేదలకు చేసిందేమి లేదంటూ అన్ని వర్గాలను మోసం చేసిందంటూ విమర్శిస్తూ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని జీవన్ రెడ్డి ఓట్లు అభ్యర్తిస్తున్నారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ను అప్పుల రాష్ట్రంగా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరుతున్నారు. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, నాలుగున్నర ఏళ్లల్లో ఒక్క పింఛను కొత్తది మంజూరు చేయలేదని, పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని, ఉద్యోగాల భర్తీ చేయలేదని, యువకులకు స్వయం ఉపాధి చూపెట్టలేదని, రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో, కల్లాల వద్ద అరిగోస పెట్టుకున్నాడని, ధరణి పోర్టల్ తో రైతుల మధ్య కొట్లాటలు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని
గద్దే దించాలని కోరుతూ జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. జగిత్యాల
నియోజకవర్గంలో ఇంటింటా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ ప్రకటించిన అన్ని వర్గాలకు ఉపయోగపడేవిధంగా ఉన్న ఆరు గ్యారంటీలను అమలు చేసి తిరుతామని, ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని జీవన్ రెడ్డి వివరిస్తూ ముందుకెళ్తున్నారు.
ఆరు గ్యారంటీలకు ప్రజల్లో మంచి స్పందన లభిస్తోంది. అన్ని ఉన్నవారికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చారని, బిఆర్ఎస్ కార్యకర్తలకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నారని, అర్హులకు ఫలాలు అందడంలేదని జీవన్ రెడ్డి ముందు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. బీసీ బంధు, మైనార్టీ బంధు, దళితబందు బీఆర్ఎస్ నాయకులు చెప్పినవారికే, అనుచరులకే ఇస్తున్నారని ఎమ్మెల్సీ కి చెప్పుకోగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయాలకతీతంగా అందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవిధంగా చూస్తానని భరోసా ఇస్తున్నారు.