balineni
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

టీడీపీ గూటికి బాలినేని

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సెక్యూరిటీని సరెండర్‌ చేయడం కలకలం రేపుతోంది. భూ అక్రమాలకు బాధ్యులైన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ భద్రతా సిబ్బందిని సరెండర్ చేయడం వెనుక స్కెచ్‌ ఉందని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ముఖ్యమంత్రి బంధువైన బాలినేని భద్రతా సిబ్బంది అక్కర్లేదంటూ రెండ్రోజుల క్రితం డీజీపీకి లేఖ రాశారు. భూ అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసుల అలసత్వం వహిస్తున్నారని బాలినేని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్‌ చేసినా కీలక సూత్రధారుల్ని పట్టుకోవడం లేదని బాలినేని ఆరోపిస్తున్నారు. అయితే బాలినేని డిమాండ్‌కు పట్టుబడుతున్న వారు కూడా వైసీపీ నాయకులే కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోందిప్రకాశం జిల్లా ఒంగోలులో ఇటీవల నకిలీ పత్రాలలో భూములు కబ్జా చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

భూముల ఆక్రమణ వ్యవహారంలో బాలినేని సూచనలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. అదే సమయంలో పోలీసుల దర్యాప్తు తీరుపై బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.భూములను కాజేసిన వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వారిని విస్మరించి కేవలం కొందరిని మాత్రమే అరెస్టు చేయడాన్ని బాలినేని తప్పు పడుతున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.మరోవైపు కేసు దర్యాప్తు ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం సాగుతోందని, కుంభకోణంలో పాల్గొన్న వ్యక్తుల ప్రమేయంపై పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్టులకు ఉపక్రమిస్తామని పోలీసులు చెబుతున్నారు. బాలినేని చెప్పిన వారిని అరెస్ట్‌ చేయడం సాధ్యం కాదని పోలీసు అధికారులు మాజీ మంత్రికి తేల్చి చెప్పారుఆగ్రహించిన బాలినేని తనకు పోలీసులు కల్పిస్తున్న రక్షణ అవసరం లేదని, వారి వైఖరికి నిరసనగా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని సరెండర్‌ చేస్తున్నట్లు డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి సోమవారం రాత్రి లేఖ రాశారు.

ఎస్కార్ట్‌ వాహనంతో పాటు నలుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని జిల్లా పోలీసు కార్యాలయానికి మంగళవారం సాయంత్రం సరెండర్‌ చేశారు.నకిలీ పత్రాలతో భూ ఆక్రమణలతో పాటు నకిలీ వీలునామాల కేసు ఒకటీ రెండు రోజుల్లో పూర్తయ్యేది కాదని, దీని లోతుపాతులు తెలుసుకోడానికి కొంత సమయం పడుతుందని ఒంగోలు ఎస్పీ స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో సంవత్సరం కూడా పట్టే అవకాశం ఉందని, దర్యాప్తులో ఎవరి ఒత్తిళ్లూ లేవని మలికాగార్గ్‌ చెప్పారుకేసు దర్యాప్తను డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్వయంగా సమీక్షిస్తున్నారని రాజకీయాలతో ప్రయేయం లేకుండా దర్యాప్తు ప్రక్రియ సాగుతోందన్నారు. కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలు సహేతుకం కాదని కొట్టి పడేశారు. ప్రతి పత్రాన్ని క్షుణ్నంగా పరిశీలించి అందులో ఎవరెవరి ప్రమేయం ఉందో నిర్ధారించుకుని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇప్పటి వరకు దర్యాప్తును దర్శి డీఎస్పీ అశోక్‌వర్ధన్‌ పర్యవేక్షిస్తున్నారని, ప్రస్తుతం అదనపు ఎస్పీకి అప్పగించినట్లు చెప్పారు.

వీరితో పాటు ఒంగోలు డీఎస్పీ, సబ్‌ డివిజన్‌లోని సీఐలు, సాంకేతిక నెపుణ్యంపై పట్టు కలిగిన ఎస్సైలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. భూ కుంభకోణంలో ప్రమేయం ఉన్న ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు.మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తన గన్‌మెన్లను వెనక్కి పంపించారనే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. మరోవైపు బాలినేని అరెస్ట్‌కు పట్టుబడుతున్న వారిలో ఒంగోలు కార్పొరేషన్‌లో కీలక పదవిలో ఉన్న వైసీపీ నాయకుడితో పాటు మరికొందరు ముఖ్య నేతలు ఉన్నారు. వీరంతా బాలినేని వర్గంగానే ఉన్నారు. సొంత మనుషుల అరెస్ట్‌ కోసం బాలినేని పట్టుబడటం ఎవరికి అంతుచిక్కడం లేదు. అటు సోషల్ మీడియాలో బాలినేని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు కాలం చెల్లిందని ట్రోల్ చేస్తున్నారు.మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పటి నుంచి రకరకాలుగా వార్తల్లో నిలుస్తున్న బాలినేని వచ్చే ఎన్నికల్లో పార్టీ వీడుతారనే ప్రచారం కూడా జరిగింది.

జగన్ స్వయంగా పలుమార్లు పిలిచి బుజ్జగించినా బాలినేని మాత్రం సమయం వచ్చినప్పుడల్లా తన ఆధిపత్యం చూపుకునే ప్రయత్నం చేస్తునే ఉన్నాడు. సోషల్‌ మీడియాలో బాలినేని వచ్చే ఎన్నికల్లో పార్టీ ఫిరాయించి జనసేన, టీడీపీ కూటమిలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది