bhuvaneshwari
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

25 నుంచి నారాభువవనేశ్వరి బస్సుయాత్ర

తిరుపతి జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంను నారా భువనేశ్వరి ప్రారంభిస్తున్నట్లు . టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో. టీడీపీ మాజీమంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి నారా భువనేశ్వరి పర్యటన వివరాలు తెలియజేశారు. అంతేకాక, చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి జిల్లాలో నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మూడు రోజుల పాటు నారా భువనేశ్వరి తిరుపతి జిల్లాలో పర్యటించనున్నట్లు చెప్పారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి నారా భువనేశ్వరి చేరుకుంటారని, మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం తిరుపతిలో పర్యటించి తిరుపతిలోనే బస చేస్తారన్నారు.  25వ తేదీ ఉదయం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లి నుండి నిజం గెలవాలి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలియజేశారు.

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో తీవ్ర ఆవేదనకు గురై మరణించిన . టీడీపీ నేత చిన్న స్వామి నాయుడు కుటుంబంను నేండ్రగుంటకు వెళ్లి నారా భువనేశ్వరి పరామర్శిస్తారని, అటు తర్వాత ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో సహపంక్తి భోజనం చేస్తారన్నారు. అనంతరం చంద్రగిరి మండలంలోని అగరాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రసంగిస్తారని, తర్వాత తిరుపతిలోనూ నారా భువనేశ్వరి పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన-. టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు సంబంధించి ఈనెల 26వ తేదీన బాధితులను పరామర్శిస్తారని, చంద్రబాబు అక్రమ అరెస్టుపై తిరుపతిలో జరిగే బహిరంగ సభలో నారా భువనేశ్వరి మాట్లాడుతారని చెప్పారు. ఇక పుంగనూరులో . టీడీపీ కార్యకర్తలపై దుశ్చర్య దారుణమని చెప్పిన ఆయన, పుంగనూరు ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పుంగనూరు ఘటనపై చిత్తూరు జిల్లా ఎస్పీ ప్రశాంత్ రెడ్డి స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉందని, తాగేసిన మైకంలోనే వైసీపీ నేతలు .

టీడీపీ‌ కార్యకర్తలను అడ్డుకోవడం జరిగిందని, సుమోటోగా కేసు తీసుకుని విచారణ జరుపుతారని ఎస్పీ చెప్పడం దారుణంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకూ వైసీపీ నేతలపై ఎన్ని కేసులు పెట్టారో, . టీడీపీ నేతలపై ఎన్ని కేసులు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రౌడీ షీటర్ అని చెప్పిన ఎస్పీ, బెయిల్ బుల్ కేసు పెట్టి ఎస్పీ, . టీడీపీ నేతలను ఎలా వేధింపులకు గురి చేస్తున్నారనేది చెప్పాలన్నారు. 41 నోటీసులు వైసీపీ రౌడీ షీటర్ పై ఎలా ఇస్తారని . టీడీపీ మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి నిలదీశారు.పోలీసులు మంత్రి పెద్దిరెడ్డికి కొమ్ముకాస్తున్నారనేందుకు ఇదొక ఉదాహరణ అని మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి విమర్శించారు. వైసీపీ రౌడీ షీటర్లు . టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పిస్తే, ఎస్పీ ఇంత నిర్లక్ష్యంగా స్పందిస్తారా? అని నిలదీశారు. టిటిడి నిర్ణయాలపై ప్రజల్లో గందరగోళం నెలకొందని, ఒక్క శాతం టిటిడి నిధులను తిరుపతి అభివృద్ధికి ఖర్చు చేస్తామని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పడంతో పాటుగా ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ పంపిన తర్వాత అవసరం లేదని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

టిటిడి చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి అభివృద్ధికి మమ్మల్ని బూచిగా చూపి నాటకాలు ఆడుతున్నారని, టీటీడీ తిరుపతి అభివృద్ధికి ఎప్పటి నుండో నిధులు ఇస్తుందని . టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు.  తిరుపతి జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంను నారా భువనేశ్వరి చేపట్టనున్న క్రమంలో చంద్రగిరి మండలం, అగరాల సమీపంలో భారీ బహిరంగ సభకు . టీడీపీ నేతలు ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్టు వార్త విని హఠాత్తుగా మరణించిన వారి కుటుంబీకులను నారా భువనేశ్వరి ఓదార్చనున్నారు. నారా భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా . టీడీపీ నాయకత్వం సన్నద్ధం అవుతుంది.