ఆరుగాలం కష్టంచి పనిచేసే రైతన్నకు మధ్యలోనే కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది రెయినీ సీజన్ లో కూడా తగినంత వర్షాలు లేవు. దీంతో సాగు నీటి ప్రాజెక్ట్ ల్లో నీరు నిల్వ కాలేదు. పంటలు పండించేందుకు అవసరమైన నీటికి రైతులు ఎదురు చూపులు చూశారు. వర్షాలు లేకపోవడం, కాలువల ద్వారా నీరు రాక పోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు, డెల్టా ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. డెల్టాలో నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. అదే విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తారు. అయితే అటు డెల్టాలో టెయిల్ భూములకు, అప్ ల్యాండ్స్ కు నీరు అందటం లేదు. దీంతో కర్షకులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం ఒక పంటకు నీరు అందించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.
ఇందులో భాగంగానే అటు పులిచింతల నుండి ఇటు పట్టిసీమ నుండి నీటిని డెల్టా ప్రాంతానికి తరలిస్తున్నారు. దీంతో డెల్టాలో మొదటి పంటైనా చేతికొస్తుందన్న ఆశతో రైతులు ఉన్నారు.ఇక పల్నాడులోమాత్రం సాగు నీటి కొరత అధికంగా ఉంది. సాగర్ లో నీరు కనీస మట్టానికి తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం కూడా సాగర్ ఆయకట్టులో వరి సాగు చేయవద్దని సూచించింది. ఆరు తడి పంటలకు మాత్రమే ఈఏడాది వారబందీ పద్దతిలో నీరు ఇస్తామని ప్రకటించింది. దీంతో చాలా చోట్ల రైతులు మిర్చి సాగు చేశారు. అయితే ప్రస్తుతం సాగర్ కాలువల ద్వారా ఆరు తడులకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
రుగాలం శ్రమించే అన్నదాతకు సాగు మధ్యలోనే కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు నిల్వ లేక, కాలువల ద్వారా సాగు నీరందక ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ పరిస్థితి తీవ్రమవుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు, డెల్టా ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది.
డెల్టాలో 4 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. అయితే, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అటు డెల్టాలో టెయిల్ భూములకు, అప్ ల్యాండ్స్ కు నీరందడం లేదు. ఈ క్రమంలో కర్షకుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఓ పంటకు నీరందించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పులిచింతల, పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి నీటిని డెల్టా ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో డెల్టాలో మొదటి పంటైనా చేతికొస్తుందన్న ఆశ రైతుల్లో నెలకొంది.అటు పల్నాడులోనూ సాగు నీటి కొరత అధికంగా ఉంది. సాగర్ లో నీరు కనీస మట్టానికి తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం కూడా సాగర్ ఆయకట్టులో వరి సాగు చెయ్యొద్దని రైతులకు సూచించింది. ఆరు తడి పంటలకు మాత్రమే ఈ ఏడాది వారబందీ పద్ధతిలో నీరు అందిస్తామని ప్రకటించింది. ఈ ప్రకటనతో రైతులు చాలా చోట్ల మిర్చి సాగు చేపట్టారు. అయితే, ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగర్ కాలువల ద్వారా ఆరు తడులకు కూడా నీరివ్వలేని దుస్థితి నెలకొంది. దీంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో మిర్చి రైతులు ఆందోళనతో పంటను పీకేస్తున్నారు. పెదకూరపాడుకు చెందిన రైతు 5 ఎకరాల్లో మిర్చి సాగు చేపట్టగా, పంట ఎదుగుతున్న సమయంలో సాగు నీరు అందలేదు. కనీసం బోరు బావుల నుంచి కూడా నీరు అందివ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశాడు. కళ్ల ముందే తన పంట ఎండిపోవడాన్ని తట్టుకోలేక 5 ఎకరాల్లో పంటను ట్రాక్టరుతో దుక్కి దున్నించేశాడు. దాదాపు నెల రోజులుగా సాగు నీటి కోసం ఎదురు చూస్తున్నామని, ఇక పెట్టుబడి పెట్టే పరిస్థితి లేకే ఇలా చేసినట్లు సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పల్నాడులోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని కర్షకులు వాపోతున్నారు. మరో 10, 15 రోజుల్లో వర్షాలు పడకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి పంట ఈ ఏడాది చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.మరోవైపు, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉల్లి దిగుబడి సైతం తగ్గింది.
దీంతో ధరలు సైతం పెరిగాయి. బహిరంగ మార్కెట్ లో ఉల్లి కిలో రూ.60 నుంచి రూ.86 వరకూ విక్రయిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ఉల్లి సాగుకు అగ్ర స్థానంలో నిలిచేది. జూన్ నుంచి అక్టోబర్ వరకూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడి తగ్గి, ఇతర ప్రాంతాలకు ఎగుమతి సక్రమంగా లేదు. దీంతో ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.