ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్‌కు విశాఖ శ్రీ శారదాపీఠం ఆహ్వానం

ఫిబ్రవరి 7 నుంచి శారదా పీఠం వార్షికోత్సవాలు

విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ఫిబ్రవరి 7 నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి విచ్చేసిన స్వాత్మానందేంద్ర జగన్ కు శారదా పీఠం తరఫున ఆహ్వాన పత్రిక అందజేశారు. అంతేకాదు సీఎం జగన్ కు శాలువా కప్పి వేదాశీర్వచనం అందించారు. కాగా, స్వామి స్వాత్మానందేంద్రతో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా సీఎంను కలిశారు.