ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, విపక్ష బీజేపీ మధ్య లిక్కర్ గొడవ ఫీక్ స్టేజ్‌కు చేరుతోంది. ఏపీలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని పురందేశ్వరి అంటుంటే.. ఆరోపణలు చేసేముందు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోవాలంటూ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇవ్వడం ఆసక్తిగా మారుతోంది.ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి దూకుడు పెంచుతున్నారు. ఆమె అధ్యక్షురాలు అయినప్పటినుంచి తనదైన శైలిలో వైసీపీ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఏపీలోని వివిధ సమస్యలపై పోరాటం మొదలుపెట్టారు. ముఖ్యంగా.. మద్యం వ్యవహారంలో వైసీపీని ఇబ్బంది పెట్టేలా పురందేశ్వరి వ్యవహరిస్తున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్, ఐటీ, ఈడీ ద్వారా మద్యం కుంభకోణాలపై విచారణ చేపట్టాలని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు పురందేశ్వరి. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వానికి మద్యం సరఫరా చేస్తున్న అదాన్ డిస్లరీస్ వెనుక విజయసాయిరెడ్డి, ఎస్పీవై అగ్రోస్ వెనుక మిధున్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం ఉందని పురందేశ్వరి చెప్పడం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.
పురందేశ్వరి వ్యాఖ్యలపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. లిక్కర్ వ్యవహారంలో ఏమాత్రం సంబంధంలేని ఇద్దరు వ్యక్తులపై ఆరోపణలు చేయడం తగదన్నారు. అర్థరహిత ఆరోపణలు చేస్తే ఊరుకునేదిలేదంటూ పురందేశ్వరికి వార్నింగ్ ఇచ్చారు విజయిసాయిరెడ్డి. .ఆరోపణలు చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలన్నారు విజయసాయిరెడ్డి.ఇక, పురందేశ్వరిపై విజయిసాయిరెడ్డి వ్యాఖ్యలను బీజేపీ నేత భానుప్రకాష్ తీవ్రంగా ఖండించారు. మహిళల పట్ల మాట్లాడేటప్పుడు విజయిసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లిక్కర్‌ను అడ్డం పెట్టుకుని అడ్డంగా దోసుకుంటున్నారనే కామెంట్స్‌పై సమాధానం చెప్పకుండా ఇష్టారీతిన మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు భానుప్రకాష్. మొత్తంగా.. లిక్కర్ వ్యవహారం ఏపీ బీజేపీ, వైసీపీ మధ్య మంటలు రేపుతోంది.పురందేశ్వరి అనే వ్యక్తి గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.ఆమెకు నిలకడలేదు.
సిద్ధాతాలు లేవు, నైతిక విలువులు లేవు. మహిళగా ఆమెను గౌరవిస్తాం. నాపై మిధున్ రెడ్డి గురించి లిక్కర్ విషయంలో ఆరోపణలు చేశారు. ఆమెకంటూ నియోజకవర్గం ఉందా..? కుటుంబ ప్రయోజనాలు, సొంత అజెండాతో ముందు తీసుకెళ్తున్నారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఆమెకు పట్టవు. పురందేశ్వరి తెలిసిందే ఆమె కుటుంబం గురించి మాత్రమే. కేవలం ఆమె సాజామికవర్గం గురించే తెలుసు. అలాంటి వ్యక్తికి స్పష్టంగా చెబుతున్నాను.. పురందేశ్వరి గారు.. ఆరోపణలు చేసే ముందు ఆధారాలను వెరిఫై చేసుకోని మాట్లాడండి. నిజంగా ఆధారాలు ఉంటే బయటపెట్టండి. టీడీపీతో లాలూచీ పడ్డ మీరు… పట్టాభి వంటి నేతలతో ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టిస్తున్నారు. అసలు లిక్కర్ అంటే ఏంటో కూడా తెలియదు. లిక్కర్ నేను తాగేదీ లేదు. నాకు లిక్కర్ బ్రాండ్ లు కూడా తెలివు. అలాంటి వ్యక్తిపై అర్థమవంతైన ఆరోపణలతో మాట్లాడండి. పురందేశ్వరి గారు.. లిక్కర్ ఆధారాలు ఉంటే బయటపెట్టండి” అని సవాల్ విసిరారు.పీలో మద్యం సరఫరా పేరుతో దందా చేస్తున్నారంటూ ఇటీవలే పురందేశ్వరి ఆరోపించారు.
అదాన్ అనే కంపెనీ వెనుక ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారని అన్నారు. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పోరేషన్ లో వందకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని చెప్పారు. వీటిలో 16 కంపెనీల ద్వారానే 74 శాతం మద్యం సేకరణ జరుగుతుందని అన్నారు. అదాన్ డిస్టలరీస్ 2019 లో హైదరాబాద్ సాగర్ సొసైటీ ప్లాట్ నెంబర్ 16 నుంచి లో ప్రారంభించారన్నారు. ఈ అదాన్ కంపెనీకి 1,160కోట్ల కేటాయింపు జరిగిందని వివరించారు. ఆదాన్ డిస్లరీస్ వెనుక విజయసాయిరెడ్డి ఉన్నట్లు మాకు సమాచారం ఉందని తెలిపారు.ఎస్పీవై అగ్రస్ సంస్థకు రూ. 1800 కోట్ల మేర సరఫరా ఆర్డర్స్ ఉన్నాయని, ఈ సంస్థ వెనుక మిధున్ రెడ్డిఉన్నారని పురంధరేశ్వరి ఆరోపించారు.