తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ వారసులను రాజకీయ అరంగ్రేటం చేయించాలనుకున్న నాయకులకు సీఎం కేసీఆర్ గట్టి షాకిచ్చారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ వారసులను రాజకీయ అరంగ్రేటం చేయించాలనుకున్న బీఆర్ఎస్ నాయకులకు సీఎం కేసీఆర్ గట్టి షాకిచ్చారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మొత్తం తొమ్మిది నియోజకవర్గాలున్నాయి. ఇందులో మూడు నుంచి నాలుగు స్థానాల్లో తమ వారుసులను ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయించాలని అధికార పార్టీ నాయకులు భావించారు. ఇందులో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంది. 2018 ఎన్నికల్లోనే పోచారం శ్రీనివాసరెడ్డి ఇదే తనకు చివరి ఎన్నికలను, ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఆయన కోరినట్టుగానే శ్రీనివాసరెడ్డి సునాయసంగా విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు భాస్కర్‌రెడ్డి డీసీసీబీ ఛైర్మన్‌గా నియమాకం అయ్యారు.
నాటి నుంచి ఏ కార్యక్రమంలో పాల్గొన్న భవిష్యత్తు నేత, కాబోయే ఎమ్మెల్యే అంటూ ఆయన అనుచరులు నినదించేవారు. ప్రస్తుత ఎన్నికల్లో బాన్సువాడ నుంచి భాస్కర్‌రెడ్డి పోటీ చేస్తారనే భావించారు. కానీ ఈ సారి ఎన్నికల్లోనూ మళ్లీ తానే పోటీ చేయబోతున్నట్టు స్పీకర్ పోచారం ప్రకటించారు. హైకమాండ్ ఆదేశాలతో పోచారం మళ్లీ పోటీలో ఉన్నారుఆ తరువాత నిజామాబాద్ రూరల్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ కుమారుడు బాజిరెడ్డి జగన్ పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయన ఆశలపై కూడా నీళ్లు చల్లారు. గతంలో జెడ్పీ ఛైర్మన్ పదవి తన కుమారుడు జగన్‌కు ఇప్పించాలని గోవర్ధన్ పట్టుబట్టారు. కానీ ఊహించని విధంగా కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు దాదాన్నగారి విఠల్‌రావుకు ఆ పదవి కేటాయించారు. ఆ సమయంలో బాజిరెడ్డిని బుజ్జగించేందుకు వచ్చే ఎన్నికల్లో మీ కుమారుడికి టిక్కెట్టు కేటాయిస్తాం అని స్వయంగా కేటీఆర్ హామీనిచ్చినట్టు సమాచారం.
కానీ ఈసారి ఎన్నికల్లో బాజిరెడ్డి జగన్‌కు బదులుగా మళ్లీ బాజిరెడ్డి గోవర్ధన్ పోటీకి సిద్ధమవుతున్నారుఇక కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సైతం ఈ సారి ఎన్నికల్లో ఆయన కుమారుడు గంప శశాంక్‌ను కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని గట్టి ప్రయత్నం చేశారు. అయితే ఆయన వైఖరితో స్వంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. దీంతో ఆయన స్థానంలో స్వయంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు.అధికార పార్టీ నుంచి అసెంబ్లీ బరిలో వారసులు వైదొలగడంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా అదే వైఖరి తీసుకున్నారు. బీజేపీ నుంచి బాల్కొండ బరిలో మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లిఖార్జునరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. బీజేపీ టిక్కెట్టుకు కూడా ఆయనకే కేటాయిస్తామని పార్టీ నుంచి వాగ్ధానం వచ్చింది. అందువల్లే ఆరేంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌కుమార్‌కు పార్టీ టిక్కెట్టుపై హామీ లభించలేదు. కానీ ఆయన స్థానంలో ప్రస్తుతం అన్నపూర్ణమ్మకు బీజేపీ టిక్కెట్టు కేటాయించింది.