chandra-high
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

బాబు కంటికి ఆపరేషన్ అవసరం

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు హెల్త్ బులెటిన్ ను జైలు అధికారులు విడుదల చేశారు. సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌. రాహుల్‌, సెంట్రల్‌ జైలు ఆస్పత్రి డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పి.కోమలి దీన్ని విడుదల చేశారు. ఈ హెల్త్‌ బులెటిన్‌లో బీపీ 120/68 గా ఉందని, శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉందని, పల్స్‌-73/మినిట్‌, ఎస్‌పీవో2- 98 అని పేర్కొన్నారు. రెస్పిరేటరీ రేట్‌-12/మినిట్‌, హార్ట్‌-ఎస్‌1+, ఎస్‌2+, లంగ్స్‌-క్లియర్‌, ఫిజికల్‌ యాక్టివిటీ-గుడ్‌, బరువు-67.5 కిలోలు అని వివరించారు. చంద్రబాబు ఆరోగ్యం సాధారణంగానే ఉందని తెలిపారు.అయితే, చంద్రబాబుకు ఓ కంటి సమస్య ఉందని ప్రభుత్వ వైద్యులు సిఫార్సు చేశారు. ఆయన కుడి కంటికి క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్స చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి కంటి డాక్టర్ నిర్ధారించారు. ప్రభుత్వ ఆసుపత్రి సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ బి.శ్రీనివాసరావు ఈ నెల 25న చంద్రబాబుని పరీక్షించి, జైలు అధికారులకు ఓ రిపోర్టు ఇచ్చారు. అందులో చంద్రబాబు కుడి కంటిలో ఇమ్మెచ్యూర్‌ క్యాటరాక్ట్‌ ఉందని, దానికి శస్త్రచికిత్స చేయాలని సూచించారు.

చంద్రబాబుకు దృష్టి సమస్యను సరిదిద్దేందుకు కుడి కంటికి క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్స చేయాలని హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి డాక్టర్లు కూడా ఇటీవల నివేదిక ఇచ్చారు. అందులో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ వైద్యులే చంద్రబాబుకు 2016లో ‘యాంగిల్‌ క్లోజర్‌ గ్లకోమా’ అనే కంటి సమస్యకు లేజర్‌ చికిత్స ఇచ్చారు. ఈ ఏడాది జూన్‌ 21న ఎడమ కంటికి క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స కూడా చేశారు. ఆ తర్వాత ఎడమ, కుడి కంటి చూపుల్లో తేడా ఎక్కువగా ఉన్నందున మూడు నెలల్లోగా కుడి కంటికీ శస్త్రచికిత్స చేయాలని ఆ వైద్యులు ఆ సమయంలోనే తెలిపారు.