ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చంద్రబాబుకు మధ్యంతర బెయిలు మంజూరు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. స్కిల్ స్కామ్ కేసులో గత 53 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉంటున్నారు.
అయితే చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసారు.. దీంతో హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.

సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు.