pawan-chandra
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చంద్రబాబు బెయిల్ పై పవన్ కళ్యాణ్ హర్షం

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ లభించడం పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.  ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… ‘తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
చంద్రబాబు నాయుడు కు హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన
అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు  విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయనను స్వాగతిద్దాం’ అని ట్వీట్ చేశారు.