ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన కులగణనపై అధికారయంత్రాంగంలోనే అయోమయం నెలకొంది. ఎలా చేయాలి? ఎవరు చేయాలి? మార్గదర్శకాలేమిటి? ఏ శాఖ బాధ్యత వహించాలి? అన్న అంశాలపై అధికారుల్లో విస్తృత చర్చ సాగుతోంది. కులగణన వంటి కీలక అంశాలను హడావిడిగానో, మొక్కుబడిగా చేయడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తవవుతోంది. శుక్రవారం నాటి క్యాబినెట్ సమావేశంలో కులగణన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ, అంతకు కొద్దిరోజుల ముందు నుండే ఉన్నతస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై తొలుత చర్చ ప్రారంభమైనప్పుడు ఇప్పటికే కులగణనను పూర్తిచేసిన బీహార్‌కు వెళ్లి అధ్యయనం చేసి రావాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, అధ్యయనం చేయడం, నివేదిక రూపొందించడం, దానిపై చర్చ చేయడం, రాష్ట్రానికి అన్వయించడం ఈ పనులన్నీ చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది.
కులగణన చేయించిన పార్టీగా క్రెడిట్ పొందడంతో పాటు, ఎన్నికల వ్యూహాల రూపకల్పనకు కూడా ఆ సమాచారాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే కులగణను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సంక్షేమశాఖలతో పాటు, ప్రణాళిక శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ఇప్పటికే మూడు, నాలుగు సమావేశాలు జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశాల్లోనే బీహార్‌కు వెళ్ల్ల్లాల్సిన అవసరం లేదని నిర్ణయించడంతో పాటు, వార్డు గ్రామ సచివాలయాలకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ‘ ఈ సమావేశాల్లోనే కులగణను ఎలా చేయాలి అన్న అంశంపై కొంత అవగాహన పెంచుకున్నాం.’ అని ఒక ఉన్నతాధికారి చెప్పారు.కులగణనకు బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల సహకారం తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించారు.
మొత్తం ప్రక్రియను ప్రణాళికా శాఖ పర్యవేక్షిస్తురది. ఈ గణనలో భాగంగా ఏ కులంలో ఎరతమంది ఉన్నారు, ఆ కులాల్లోని ఉప కులాలు, వారి సామాజిక, ఆర్ధిక పరిస్థితి వంటి అరశాలను సేకరిరచాల్సి ఉరటురది. ఇది ఒకరకంగా సమగ్ర సర్వేగానే అధికారులు అభివర్ణిస్తున్నారు.ప్రభుత్వాలు చేసే సర్వేలకు చట్టబద్దత అనేది చాలా ముఖ్యం. గతంలో ఈ తరహా సర్వేలను ఉపాధ్యాయుల చేసే వారు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కనుక ఎటువంటి సమస్య ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా కులగణన చేయించాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,34,694 మంది గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు ఉన్నప్పటికీ వారిపై ఇప్పటికే విపరీతమైన పనిభారం ఉంది. గతంలో సాధికారిత సర్వే, స్మార్ట్ పల్స్ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే వంటివి సచివాలయాల ద్వారా జరిగినప్పటికే వాస్తవంలో ఆ సమాచారాన్ని సేకంచింది వాలంటీర్లే! వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. .
ఇప్పటికే ఉన్న పనులుకు తోడు ఈ తరహా సర్వేలు వారికి అదనపు భారమే! గతంలో నిర్వహించిన సర్వేల్లో కులం, మతం, ఆర్థిక పరిస్థితి, వారి వృత్తులు, ప్రభుత్వం నురచి అరదుకురటున్న పథకాల వివరాలు వంటివి ఉన్నప్పటికీ అవి ప్రస్తుతం పనికిరావని అంటున్నారు. కులగణనను ఆర్థిక సామాజిక సర్వే రూపంలో వాలంటీర్లు చేత డేటా సేకరించబోతున్నట్లుగా చెప్పడాన్ని బట్టి చూస్తుంటే కుల అసమానతలు తగ్గించే చర్యగా కాకుండా తక్షణ ఎన్నికల రాజకీయ ప్రయోజనాల కోసం బిసిలను మభ్యపెట్టడానికి చేస్తున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. సమగ్ర భూపంపిణీ కోసం పేదల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ, అటవీ భూములన్నిటికీ తక్షణం పట్టాలు ఇవ్వాలని, అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను తిరిగి పేదలకు స్వాధీనం చేయాలని కోరింది. పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ రైతులందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలని, అనేక పట్టణాల్లో దాదాపు రెండు లక్షలమందికి పైగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న వారందరికీ పట్టాలివ్వాలని, పరిశ్రమలు పెట్టకుండా కార్పొరేట్ల ఆధీనంలో ఉన్న భూములను వెంటనే స్వాధీనం చేసుకొని పంపిణీ చేయాలని, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల అమలు సమీక్ష కోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు కోరారు.
రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉన్నప్పటికీ క్యాబినెట్ సమావేశంలో కనీసం చర్చ కూడా రాకపోవడం అన్య్యాయమని ఆయన తెలిపారు. రైతుల, కూలీల సమస్యలు గ్రామీణ పేదల దుస్థితి అర్థం చేసుకోలేని ప్రభుత్వ చర్యను ఖండించారు. పంట నష్టపరిహారానికి , రెండోపంట వేసుకునేందుకు , అప్పులపై వడ్డీ మాఫీకి తక్షణం కనీసం పదివేలకోట్లు కేటాయించి సహాయక చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం బందాలను పంపి ప్రకతి సహాయ నిధి నుండి నిధులివ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టి గ్రామీణ ప్రజలను ఆదుకోవాలని కోరారు.