ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

TTD: శ్రీవారి దర్శనానికి టీకా సర్టిఫికెట్‌ తప్పనిసరి

 తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన టికెట్లను టీటీడీ శుక్రవారం ఆన్‌లైన్‌లో ఉంచనుంది. అక్టోబర్ నెలకి సంబంధించి రోజుకి 8 వేల టికెట్లు విడుదల చేయనుంది. ఉదయం 9 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 

అలానే సర్వదర్శనం టికెట్లను రేపటి నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.. ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని టీటీడీ సూచించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొంది.