rain-ap
ముఖ్యాంశాలు

ఐదు రోజులపాటు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరకిలు జారీ చేసింది. రానున్న ఐదు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరకిలు జారీ చేసింది. రానున్న ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆ తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
ఏపీలోనూ…
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రధానంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే తమిళనాడు అంతటా వర్షాలు కురుస్తున్నాయి.