అంతర్జాతీయం ముఖ్యాంశాలు

భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

దక్షిణ కొరియాలోని ఓ భవనంలో చెలరేగిన మంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. డేగు నగరంలోని ఓ కార్యాలయ భవనంలో మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. సహాయక చర్యల కోసం పదుల సంఖ్యలో అగ్నిమాపక దళాలను మోహరించినట్లు డేగు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు వీరంతా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. రెండో ఫ్లోర్​లో చెలరేగిన ఈ మంటల్లో.. 35 మంది గాయపడ్డారని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.