కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు అధ్యక్షతన వై.సి.పి సామాజిక సాధికార బస్ యాత్ర బహిరంగ సభకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి దాడిశెట్టి రాజా, మంత్రి పినిపే విశ్వరూప్, కాకినాడ ఎంపీ వంగా గీత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, పిఠాపురం ఎంఎల్ఏ పెండెం దొరబాబు, ప్రత్తిపాడు ఎం.ఎల్. ఏ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్. పాల్గొని సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు ,మాజీ మంత్రి ,కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబు కు ఎప్పుడో దృష్టి లోపం ఉందని, ఆయన అధికారం లో ఉంటే పేద ప్రజలు కనిపించరని, నిరంతరం పేద ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అన్నారు.
పార్టీ స్థాపించి., పక్క పార్టీ వారిని ముఖ్యమంత్రి నీ చేయడానికి తహతహలాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు.మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు వలన మోసగింపబడ్డ సామాజిక వర్గాలన్నీ పురివిప్పి నాట్యమాడుతున్నాయన్నారు. మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ చంద్రబాబు ఎల్లప్పుడూ ప్రాజెక్టు లో పేరుతో దోచుకోవడం తప్ప పేద ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ 2014నుండి 2019వరకు చంద్రబాబు పాలన, 2019 నుండి 2024 వరకూ జగన్ పాలన లో సామాజిక న్యాయాన్ని చూడాల్సిందిగా కోరుతున్నామన్నారు . హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సామాజిక న్యాయం చేయడంలో లో జగనన్న ముందు జగనన్న తర్వాత అని చూడాలని. రాజు బలవంతుడైతే శత్రువులంతా ఒకటవుతారన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా సామాజిక సాధికార యాత్ర ఒక పండుగలా జరుగుతుందని. స్వాతంత్రం తర్వాత నెల్లూరు జిల్లా నుంచి బి.సి కులానికి చెందిన ఏ ఒక్కరూ మంత్రి కాలేదని. జగన్ వల్లనే మొదటిసారి బి.సి కులం నుండి నేను మంత్రి అయ్యానన్నారు.
ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే సామాజిక న్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ,మంత్రి దాడిశెట్టి రాజా ,ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, పంduల రవీంద్ర , బొమ్మి ఇస్రాయిల్, కర్రి పద్మశ్రీ, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ ,డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెద్దపాటి అమ్మాజీ, పార్టీ ఎస్సీ సెల్ జోనల్ రీఛార్జ్ గుల్ల ఏడుకొండలు, జడ్పిటిసి సభ్యుడు గుబ్బల తులసి కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ బుర్ర అను బాబు, వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్దినిడి సుజాత ,పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు