అత్యంత వేగంగా డ్రాగన్ దేశం చైనా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అణ్వాయుధ సమీకరణలో చైనా తన వేగాన్ని తగ్గించుకోవాలని అమెరికా కోరింది. అణుశక్తిగా మారేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు దాచిపెట్టలేని నిజాలని వైట్‌హౌజ్ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. చైనా తన పశ్చిమ ప్రాంతంలోని ఓ ఎడారిలో సుమారు వంద మిస్సైళ్లను దాచిపెట్టేందుకు నిర్మాణాలు సాగిస్తున్నట్లు ఇటీవల వాషింగ్టన్ పోస్టు ఓ కథనాన్ని రాసింది. ఆ రిపోర్ట్‌కు బదులుగా వైట్‌హౌజ్ ఈ వివరణ ఇచ్చింది.
చైనా అణ్వాయుధ సామర్థ్యంపై అమెరికా ఆందోళన