ind-nzl
అంతర్జాతీయం క్రీడలు

న్యూజిలాండ్ తోనే సెమీస్

 వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ ఆడే జట్లు ఏవో దాదాపు ఖరారు అయ్యాయి. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా, ఆసీస్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. తాజాగా న్యూజిలాండ్ నాలుగో టీమ్‌గా సెమీస్‌కు అర్హత సాధించింది. శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన న్యూజిలాండ్.. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌‌లను వెనక్కనెట్టి సెమీస్‌కు దూసుకెళ్లింది.అద్భుతం జరిగితే తప్పా న్యూజిలాండ్ సెమీస్ బెర్త్‌కు వచ్చే డోకా లేదు. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే క్రికెట్ చరిత్రలోనే కనివీని ఎరుగని విజయం అంత తేలిక కాదు.ముందుగా బౌలింగ్ చేస్తే మాత్రం ఇంగ్లండ్‌ను 50 పరుగులకు ఆలౌట్ చేసి 2.3 ఓవర్లలో చేధించాలి. ఏ లెక్కన చూసుకున్నా.. ఇది అసాధ్యం. మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్‌ ఈ టోర్నీలో విఫలమైనా.. నెదర్లాండ్స్‌పై సాధించిన భారీ విజయంతో ఆ జట్టు ఫామ్‌లోకి వచ్చింది.

పాకిస్థాన్ తలకిందులు తపస్సు చేసినా.. సెమీస్ చేరలేదుఈ క్రమంలోనే న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖరారు అయినట్లేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ సెమీఫైనల్ అభ్యర్థి కూడా న్యూజిలాండేనని స్పష్టం చేస్తున్నారు. నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. 16న కోల్‌కతా వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆసీస్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.