dk
జాతీయం రాజకీయం

ఆపరేషన్ ఆకర్ష్… డీకే నయా ప్లాన్

కర్ణాటకలోని రాజకీయ పార్టీలు 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. 20 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలపై గురిపెట్టింది, సొంత ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్ పార్టీ రిసార్టులకు మకాం మార్చారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఆపరేషన్‌ హస్తం మొదలైయ్యింది. జేడీఎస్ ఎమ్మెల్యేలపై కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ డేగ కన్ను వేశారని జేడీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. 19 మంది ఎమ్మెల్యేలలో 13 మంది ఎమ్మెల్యేలకు డీకే శివకుమార్‌ గాలం వేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆపరేషన్‌కు హస్తంకు బ్రేక్‌ వేసేందుకు మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కమరస్వామి మాస్టర్ ప్లాన్ వేసి రిసార్ట్ రాజకీయాలు మొదలుపెట్టారు. మూడు రోజుల పాటు హాసన్‌లోని ప్రైవేట్ రిసార్ట్‌లో జేడీఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్లాన్ చేశారు. మంగళవారం హాసనాంబే దర్శనం అనంతరం రిసార్ట్‌కు వెళ్లారు.

కాగా, మంగళవారం రాత్రి రిసార్ట్‌లో మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో విడివిడిగా చర్చించి అభిప్రాయాలు తెలుసుకున్నారు.  లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో పొత్తు వల్ల తలెత్తే సమస్యలు, పార్టీలో నెలకొన్న అసంతృప్తి తదితర అంశాలపై మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి జేడీఎస్ ఎమ్మెల్యేలతో చర్చించినట్లు సమాచారం. జేడీఎస్ ఎమ్మెల్యేలతో ముక్తసరిగా మాట్లాడిన మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి ఎవరు ఆపరేషన్ హస్తం చేతికి చిక్కకూడాదని సూచించారని తెలిసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు కానీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపుపైదృష్టి సారిద్దామని, పొత్తు వల్ల మనం లబ్ధి పొందుతామని జేడీఎస్ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం కుమారస్వామి అన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికీ 19 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలలో శరంగౌడ్ కందకూర్, దేవదుర్గ ఎమ్మెల్యే కారమ్మ మాజీ సీఎం, పార్టీ కర్ణాటక చీఫ్ కుమారస్వామి ఆదేశాల మేరకు రిసార్ట్‌కు రాలేదని వెలుగు చూసింది.

ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతా ఎమ్మెల్యేలంతా కుమారస్వామి బసచేసిన రిసార్ట్‌కు వచ్చారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు శరణ్‌గౌడ, కారమ్మ సహా కొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో పొత్తుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జేడీఎస్ ఎమ్మెల్యేల అసమ్మతికి తెర వెయ్యడానికి కుమారస్వామి శ్రీకారం చుట్టారని తెలిసింది. సినిమా స్టైల్లో ఏటీఎంలో లూటీ, సీసీటీవీలకు కలర్ స్ప్రే, ఏటీఎం మిషన్ కు గ్యాస్ కట్టర్ గిఫ్ట్! దేవదుర్గ ఎమ్మెల్యే కారమ్మ కూడా బుధవారం హాసన్ లోని రిసార్ట్‌కు వచ్చే అవకాశం ఉందని జేడీఎస్ వర్గాలు అంటున్నాయి. అయితే శరణ గౌడ్ మాత్రం కందకూరు దూరం పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేతో కుమారస్వామి వన్ టు వన్ మంతనాలు జరుపుతారని, ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు మా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని జేడీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఏ కారణం చేతనైనా ఈ కాంగ్రెస్ నేతలు ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు జేడీఎస్ ఎమ్మెల్యేలతో చర్చిస్తామన్నారు. అలాగే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో డీకే శివకుమార్ వ్యూహానికి కౌంటర్ స్ట్రాటజీ ప్లాన్ చేసి, డీకే సోదరుల ఆపరేషన్ హస్తం గేమ్‌కు చెక్ పెట్టేందుకు హెచ్ డీ కుమారస్వామి పైఎత్తులు వేస్తున్నారని జేడీఎస్ నాయకులు అంటున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉండగానే కర్ణాటకలో రిసార్టు రాజకీయాలు మొదలైనాయి.