ఈనెల 11 న శనివారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించ తలపెట్టిన “మాదిగల విశ్వరూప మహాసభకు” మాదిగలు, ఉప కులాలు లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని మాది రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) జిల్లా ఉపాధ్యక్షులు గంజహళ్లి పసేద్దుల మహాదేవ్ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం గోనెగండ్ల మండలంలో.. గోనెగండ్ల ఎస్సీ కాలనీ, బైలిప్పుల, అగ్రహారం, ఎనకండ్ల, ఐరన్ బండ వివిధ గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలలో మాదిగ పేటల్లో మాదిగల విశ్వరూప మహాసభ కరపత్రంలను విడుదల చేశారు. పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకు మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సాధించుకునే సమయం ఆసన్నమైందని మాదిగల ఐక్యతను ప్రదర్శిస్తూ ఉద్యోగులు, యువకులు మహిళలు పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కు తరలిరావాలని కోరారు. ఇంటికో మనిషి.. ఊరికో వాహనం తో పెద్ద ఎత్తున బయలుదేరుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గోనెగండ్ల మద్దిలేటి, నాగరాజు, మారెప్ప, మునిస్వామి, బైలుపుల గ్రామ ఎమ్మార్పీఎస్ నాయకులు రంగన్న, బాలు, అగ్రహారం గ్రామ ఎమ్మార్పీఎస్ నాయకులు దుగ్గెన్న, రంగన్న, వీరేష్, యనకండ్ల గ్రామ ఎమ్మార్పీఎస్ నాయకులు తిరుపాలు,యోహాను, ఐరన్ బండ గ్రామ ఎమ్మార్పీఎస్ నాయకులు చంద్ర,విజయ్ తదితరులు పాల్గొన్నారు.