తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత విజయశాంతి, బాబూ మోహన్ మాత్రమే సినీ రంగం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. కానీ గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క బాబూ మోహన్ మాత్రమే పోటీ చేశారు! అదే విధంగా జయసుధ కూడా ఎక్కడా పోటీ చేయలేదు. కానీ ఈ సారి ఈ ముగ్గురితో పాటు నిర్మాతలు దిల్ రాజు, రామ్ తాళ్లూరి, దర్శకుడు శంకర్, నితిన్, జీవిత, కత్తి కార్తీక, ప్రకాశ్ రాజ్ వంటి వారందరూ కూడా వివిధ పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. పైనల్‌గా బాబూ మోహన్ మాత్రమే ఆందోల్ నియోజక వర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్నాడు. బీజేపీ విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యుర్థుల మొదటి లిస్ట్‌లో ఆయన పేరు కూడా లేకపోవడంతో పార్టీపై ఆయన పలు విమర్శలకు దిగాడు. దీంతో రెండో లిస్ట్‌లో ఆయన పేరును బీజేపీ ఖరారు చేసింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీజేపీలో చేరిన సీనియర్ నటి జయసుధకు సీటు దక్కలేదు.
అదే పార్టీలో చాలా ఎళ్లుగా ఉన్న ఫైర్ బ్రాండ్ విజయశాంతి అలియాస్ రాములమ్మకు కూడా సీటు దక్కలేదు. ఎన్నికల బరిలో నిలబడకూడదని వారు నిర్ణయించుకున్నారా..? లేదా పార్టీనే వారిని పక్కన పెట్టేసిందా..? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్,కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్ని పార్టీలకు తెలుగు చిత్ర సీమ నుంచి సానుభూతి పరులు ఉన్న విషయం తెలిసిందే.కానీ వారెవ్వరూ ఎన్నికల సమయంలో ఆ పార్టీల తరపున ప్రచారం చేసేందుకు ముందుకు రావడం లేదు. కనీసం ఎక్కడా కూడ నోరెత్తడం లేదు. దీనికి ప్రధాన కారణం భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురుకావచ్చు.. మనకెందుకు ఈ ఎన్నికల గొడవ అని వారు ఎక్కడా కూడా నొరెత్తడం లేదని తెలుస్తోంది.2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయశాంతి. గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి కచ్చితంగా బరిలోకి దిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఇంకోవైపు, ఇటీవల పార్టీలో క్రియాశీలంగా ఉన్న జీవిత కూడా బీజేపీ తరఫున పోటీలోకి దిగుతారని భారీ ఎత్తున ప్రచారం జరిగింది.
ఆమె జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉంటారని వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు జయసుధ కూడా సికింద్రాబాద్ నుంచి ఎన్నికల పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతుండగా దానిని ఆమె కొట్టిపారేసింది. తాను ఎక్కడ నుంచి పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించిందిఇప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేసి రేపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోతే తన పరిస్థితి ఏంటి..? అధికారంలోకి వచ్చిన పార్టీతో లేనిపోని గొడవలు ఎందుకు..? సినీ పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖుల మాదిరే తాను కూడా సైలెంట్‌గా ఉండటమే మంచిదని ఆమె నిర్ణయానికి వచ్చారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో ఆ పార్టీ తెలంగాణ విభాగం మహిళా ర్యాలీ చేపట్టింది.ఇందులో జయసుధ ప్రధాన ఆకర్షణగా నిలవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఆ సమయంలో రాములమ్మకు ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆమె అసంతృప్తితో ఉన్నారని, ఆమె పార్టీని వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అప్పట్లో ఒక్కసారిగా గుప్పుమంది.
ఆమె స్థానాన్ని జయసుధతో బీజేపీ భర్తీ చేసిందని పలువురు చెప్పుకొచ్చారు.తెలంగాణను వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీలో చేరడాన్ని విజయశాంతి తీవ్రంగా వ్యతిరేకించడం కూడా ఆ పార్టీలో కొందరికి మింగుడు పడలేదు. కొన్ని సందర్భాల్లో కిరణ్ కుమార్ రెడ్డితో వేదిక పంచుకోవడానికి సైతం ఆమె ఆసక్తి చూపక పోవడంతో కొందరు నేతలకు తలనొప్పిగా మారింది. మణిపూర్ హింసాకాండపై కూడా ఆమె చేసిన ట్వీట్ బీజేపీని షాక్‌కు గురిచేసింది. అంతేకాక కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రకటనలు, పోస్టులు పెట్టడం, సోనియా గాంధీ, రాహుల్ వ్యాఖ్యలకు వత్తాసు పలుకడంతో ఆమె మళ్లీ కాంగ్రెస్ వైపు వెళ్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయికానీ ఆమె ప్రస్తుతానికి బీజేపీలోనే కొనసాగుతున్నా.. ఎక్కడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు.
అదే సమయంలో కొన్ని నెలల క్రితం బీజేపీ కండువా కప్పుకున్న జయసుధ కూడా ప్రచారానికి దూరంగానే ఉంది. పలు రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉన్నా ఇతర సినీ ప్రముఖులు కూడా తెలంగాణ ఎన్నికల్లో ఎక్కడా కూడా కనిపించడం లేదు. దీనంతటికి కారణం వారి సినిమా కెరియర్ ట్రాక్ బాగుంది కదా..? తమకు అవసరం లేని ఈ పాలిటిక్స్ ఎందుకని వారు గ్రహించినట్లు తెలుస్తోంది.