bjp-cong
తెలంగాణ రాజకీయం

కాంగ్రెస్, బీజేపీలు గెలిస్తే… ఢిల్లీ నుంచే పాలన

జగిత్యాల జిల్లాలో కథలాపూర్ లో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు బీడీ చుట్టే కార్మికులను పట్టించు కోలేదు.. కటాఫ్ తేదీ లేకుండా డిసెంబర్ 3 తర్వాత తప్పకుండా అర్హులైన అందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు. మీకు రెండు ఛాన్స్ లు ఇచ్చాం కదా అని ఇంకో ఛాన్స్ ఇంకొకరికి ఇవ్వొదు..మీరు ఓడిపోతేనే తెలంగాణ గెలుస్తాంది.. మోడీ అల్లం, బెల్లం అన్నాడు మోచేతికి బెల్లం పెట్టాడు అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.18 ఏళ్లు నిండిన మహిళలకు కూడా పెన్షన్ ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా ఉన్నాం.. సీఎం కేసీఆర్ ను ఓడించేందుకు యోగి, బోగి, షేర్లు వస్తున్నారు.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు టికెట్లు, బీ- ఫాంలు ఢిల్లీలో ఇస్తారు ఇక్కడ కాదు అంటూ ఆయన మండిపడ్డారు. ఆడబిడ్డల ఉసురు పోసుకున్న ఏ పార్టీ బాగుపడదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తుల ఉమకు మంచి పదవి ఇప్పిస్తానని కేటీఆర్ మాట ఇచ్చారు.

తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చాక సాగు, తాగు నీరు, కరెంటు సమస్యలపై నజర్ పెట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడోసారి అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ అభివృద్దిపై దృష్టి పెట్టబోతున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్లాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.